Expensive Watch: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ ఇది.. ఎన్ని వందల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గడియారంగా 'గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్' నిలిచింది. అరుదైన 110 క్యారెట్ల మల్టీకలర్ డైమండ్ లతో రూపొందించిన ఈ వాచీ ధర రూ.458 కోట్లు. 30 మంది నిపుణుల బృందం 4ఏళ్లకుపైగా కష్టపడి ఈ అద్భుతమైన కళాఖండాన్ని పూర్తి చేశారు.

New Update
Expensive Watch: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ ఇది.. ఎన్ని వందల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే!

Most Expensive Watch in The World: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గడియారంగా 'గ్రాఫ్ డైమండ్స్ హాలూసినేషన్' నిలిచింది. అరుదైన 110 క్యారెట్ల మల్టీకలర్ డైమండ్ లతో రూపొందించిన ఈ వాచీ ధర రూ.458 కోట్లు ఉండటం విశేషం. కాగా దీనిని లండన్‌కు చెందిన ప్రముఖ గ్రాఫ్ డైమండ్స్ (Graff Diamonds) కంపెనీ తయారుచేసి 2014లో ఆవిష్కరించింది. ఇందులో ప్లాటినం బ్రాస్‌లెట్‌పై వజ్రాలను సెట్ చేశారు.

నాలుగున్నర సంవత్సరాలు..
ఇక ఈ కంపెనీ స్థాపకుడు లారెన్స్ గ్రాఫ్ (Lawrence Graff) ఆలోచనగా రూపొందించబడిన ఈ కళాఖండం మొత్తం 110 క్యారెట్ల అరుదైన రంగురంగుల వజ్రాలను కలిగివుంది. డిజైనర్లు, శాస్త్రవేత్తలతో సహా హస్తకళాకారులతో కలిపి మొత్తం 30 మంది నిపుణుల బృందం నాలుగున్నర సంవత్సరాలపాటు కష్టపడి ఈ అద్భుతమైన కళాఖండాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత ఖరీదైన వాచ్‌గా ' గ్రాఫ్ డైమండ్స్ ది ఫాసినేషన్' నిలిచింది.152.96 క్యారెట్ల తెల్లని వజ్రాలు, దాని మధ్యలో అరుదైన 38.13-క్యారెట్ పియర్-ఆకారపు వజ్రంతో అలంకరించబడిన ఈ వాచ్ విలువ $40 మిలియన్లు (సుమారు రూ. 331 కోట్లు). కాగా 2015లో ఇది లాంచ్ చేయబడింది.

ఇది కూడా చదవండి ;Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. రఘునందన్ రావుకు బీజేపీ షాక్?

అనంత్ అంబానీ దగ్గర..
వీటితోపాటు మరిన్ని విలాసవంతమైన గడియారాలు, ముఖ్యంగా పాతకాలపు వాచీలు, ఐకానిక్ గోల్డ్ కార్టియర్ ట్యాంక్ ఫ్రాంకైస్ వాచ్‌ను ఒకప్పుడు ప్రిన్సెస్ డయానా యాజమాన్యంలో ఉండేవి. కాలక్రమంలో అవన్నీ ప్రిన్స్ హ్యారీకి బదిలీ చేయబడ్డాయి. అదేవిధంగా రోలెక్స్ పాల్ న్యూమాన్ డేటోనా, 2017లో $17 మిలియన్లకు (సుమారు రూ. 140 కోట్లు) వేలం వేయబడింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వాచీలలో ఒకదాన్ని కలిగి ఉన్నాడు. అతను అరుదైన టైమ్‌పీస్‌ల పట్ల ఆసక్తి చూపిస్తుంటాడని, ఇటీవల ఓ వేడుకలో అనంత్ రూ. 18 కోట్లకు పైగా విలువైన పాటెక్ ఫిలిప్ గ్రాండ్‌మాస్టర్ చిమ్‌ను ధరించి కనిపించడం విశేషం.

Advertisment
తాజా కథనాలు