Graduate MLC Election Polling: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. 12 గంటల వరకు 29.30శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో..ప్రాధ్యాన్యతాక్రమంలో ఓటింగ్ జరుగుతుంది.
Also Read: కవిత కేసులో కీలక మలుపు.. బెయిల్‌పై ఉత్కంఠ..!
మొత్తం 12 జిల్లాలు.. 34అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ విధించనున్నారు. 52మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఓటర్లు- 4,63,839 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 2,88,189, మహిళలు 1,75,645, మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.