Ashok Goud : స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్‌గౌడ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత! నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్‌గౌడ్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే తనపై దాడి చేశారని అశోక్‌గౌడ్ ఆరోపిస్తున్నారు. By Nikhil 27 May 2024 in రాజకీయాలు టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్‌గౌడ్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే తనపై దాడి చేశారని అశోక్‌గౌడ్ ఆరోపిస్తున్నారు. స్థానిక డోకూరు గార్డెన్‌లో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లానని ఆయన చెబుతున్నారు. ఎందుకు డబ్బులు పంచుతున్నారని అడిగినందుకు తన ఫోన్లు ధ్వంసం చేసి, దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. నార్కట్‌పల్లి పీఎస్ ముందు అశోక్ గౌడ్ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి