Governor Tamilisai: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మోరును గవర్నర్ తమిళి సై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గవర్నర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆమె అక్కడి నుంచి సచివాలయానికి బయల్దేరనున్నారు. అక్కడ సచివాలయం ప్రాంగణంలో ప్రభుత్వం నిర్మించిన చర్చి, మసీదు ఇంకా నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొననున్నారు.
అయితే చాలా కాలంగా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ గా వార్ నడుస్తోంది. ముఖ్యంగా ప్రోటోకాల్ విషయంలో మొదలైన ఈ రగడ పెడింగ్ బిల్లుల అంశంతో సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దీంతో తమిళి సై కేసీఆర్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా పలు సార్లు బహిరంగంగానే విమర్శలు కురిపించారు.
ఇక ట్విట్టర్ వేదికగా కూడా తమిళి సై వర్సెస్ బీఆర్ఎస్ నేతలుగా నడిచిన వార్ చాలా సార్లు హీట్ ను పుట్టించింది. అయితే టీఎస్ ఆర్టీసీ బిల్లు విషయంలో కూడా గవర్నర్ వ్యవహార శైలిని తప్పుబట్టిన ప్రభుత్వం విమర్శలకు దిగింది. చివరికి గవర్నర్ ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ఎపిసోడ్ కు తెరపడింది. అయితే ఇప్పటికీ పెడింగ్ బిల్లుల విషయంలో ఫైట్ నడుస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో గురువారం రాజ్ భవన్ లో పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లారు. అయితే అప్పుడు దాదాపుగా 20 నిమిషాల పాటు గవర్నర్ ఇంకా సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాని తరువాత గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం సచివాలయంలో చేపట్టిన మసీదు, చర్చి, నల్లపోచమ్మ ఆలయాల ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం ఇచ్చారు. దీంతో గవర్నర్ అక్కడికి వెళుతున్నారు.
Also Read: ఇక తగ్గేదేలే…ఎవడొస్తారో రండిరా.. ఇండియన్ ఆర్మీ అదుర్స్..!!