మరికొన్ని గంటల్లో హైదరాబాద్ కు గవర్నర్..ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్..!!

పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళి సై మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆర్టీసీ బిల్లు పై ప్రభుత్వం ఇచ్చిన వివరణతో గవర్నర్ సంతృప్తి చెందినట్టు సమాచారం. దీంతో ఈ రోజు రాత్రికే టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్..!

Telangana Assembly: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి!
New Update

పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళి సై మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే ఆర్టీసీ బిల్లు డ్రాప్ట్ పై ఆమె లేవనెత్తిన 5 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వకంగా వివరణ వెళ్లింది. దీంతో ఆమె సంతృప్తి చెందినట్టు సమాచారం. దీంతో పాటు ఆర్టీసీ కార్మికుల ఛలో రాజ్ భవన్ నిరసన కార్యక్రమంతో రాజ్ భవన్ ను ముట్టడించిన క్రమంలో తమిళి సై ఆర్టీసీ యూనియన్ నేతలు, కార్మికులతో పుదుచ్చేరి నుంచే వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు.

అయితే ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛను, ఇంకా సంక్షేమం గురించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం అదే విధంగా కార్మిక సంఘాలు సైతం సంతృప్తి కావడంతో.. అసెంబ్లీలో చర్చకు వీలుగా ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళి సై పర్మిషన్ ఇవ్వనున్నట్లు మౌఖికంగా సానుకూలంగా రియాక్ట్ అయినట్టు సమాచారం.  దీంతో రాత్రికి పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ చేరుకున్న తరువాత ఆమె డ్రాఫ్ట్ బిల్లును స్టడీ చేసి  ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఆదివారం కూడా జరుగుతున్నందున ఉభయ సభల్లో బిల్లును ప్రవేశపెట్టి చర్చల తరువాత ఏకగ్రీవంగా ఆమోదం తెలిపే విధంగా ఈ రోజు రాత్రికే గవర్నర్ అనుమతించే అవకాశముంది. దీంతో ఆర్టీసీ బిల్లుపై మరికొన్ని గంటల్లోనే ప్రతిష్టంభన తొలిగిపోనుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడిన తరువాత ఆర్టీసీ ఉద్యోగులు శాంతించారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ లో గవర్నర్ ఎక్కువగా ఉద్యోగుల భవిష్యత్తు కోసమే ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గతంలో సమ్మె చేసిన సందర్భంగా సంపూర్ణ మద్దతును తను తెలియజేసినట్టుగా కూడా ఆమె గుర్తు చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe