/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/governor-jpg.webp)
Governor: తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 11 ప్రభుత్వ పథకాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని హెచ్చరించారు.
Also Read: విఐపీలకు షాక్.. స్వయంగా వస్తేనే స్వామి దర్శనం: టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న స్వానిధి పథకం మహిళలు ఆర్థిక స్వాలంబన సాగిస్తోందని వ్యాఖ్యనించారు. ఎంతో మంది మహిళలను ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా తీసుకెళ్తుందని తెలిపారు. గ్రామీణ ప్రజలకు జలజీవన్ మిషన్ స్వచ్ఛమైన అందిస్తుండటం సంతోషించదగ్గ విషయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలు సాధించాలంటే ప్రభుత్వ అధికారుల కృషి అవసరమని సూచించారు.
Also read: ఏపీలో పాతమిత్రులు మళ్లీ కలుస్తారా!.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఓకే చెప్పిందా!
వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రచార రథాల ద్వారా ప్రజల్లోకి కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు అబ్దుల్ నజీర్, రాష్ట్ర గవర్నర్.