TG Governor: తెలంగాణకు కొత్త గవర్నర్.. మోదీ సన్నిహితుడికే అవకాశం!

తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ ను కేంద్రం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి అయిన కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబేను తెలంగాణ గవర్నర్ గా నియమించబోతున్నట్లు సమాచారం.

New Update
TG Governor: తెలంగాణకు కొత్త గవర్నర్.. మోదీ సన్నిహితుడికే అవకాశం!

Ashwini Kumar: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో కేంద్రంలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రాల గవర్నర్ల మార్పులు చేర్పులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర మాజీ సివిల్ సప్లమ్ ఎన్విరాన్ మెంట్, ఫుడ్ కార్పొరేషన్ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే పేరును తెలంగాణ గవర్నర్ గా పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం.

మోదీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి..
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి అనే పేరున్న అశ్విని కుమార్ గత ప్రభుత్వంలో మోడీ కేబినెట్ లో పని చేశారు. 1953 జనవరిలో బిహార్ లో జన్మించిన అశ్విని కుమార్ చౌబే ఆ రాష్ట్ర రాజకీయాల్లో నుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రక్రియలో కీలక అశ్విని కుమార్ కీల పాత్ర పోషించారు. అయితే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహారచన చేస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.

రాజ్యంగబద్ధమైన పదవుల విషయంలోనూ జోరు..
ఈ మేరకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంపై దృష్టి సారించి కాశాయపార్టీ ప్రభుత్వం రాజ్యంగబద్ధమైన పదవుల విషయంలోనూ జోరుపెంచినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం ఇన్ చార్జి గవర్నర్ స్థానంలో మోడీకి అత్యంత నమ్మకస్తుడైన అశ్విని కుమార్ చౌబే పేరును గవర్నర్ గా పంపించాలని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి సైతం గవర్నర్ పోస్ట్ వరించబోతున్నదని అయితే అతన్ని కర్ణాటకకు నియమించే అవకాశాలున్నట్ల సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు