Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం!

మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ ను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన తరువాత చంపై సోరెన్‌ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్‌ అంగీకరించారు. దాంతో శుక్రవారం నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం!
New Update

Jharkhand: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) సీనియర్‌ నాయకుడు చంపై సోరేన్‌ (Champai Soren) శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ (Hemanth Soren)  ను ఈడీ (ED)  అధికారులు అరెస్ట్‌ (Arrest) చేసిన తరువాత చంపై సోరెన్‌ ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టేందుకు గవర్నర్‌ అంగీకరించారు.

చంపై సోరెన్‌ విజ్ఞప్తి: 

గురువారం నాడు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ (CP Radhakrishnan) ను చంపై సోరెన్‌ కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం కల్పించాలని చంపై సోరెన్‌ ఆయనకు విజ్ఞప్తి చేశారు. హేమంత్‌ సోరెన్‌ ను అదుపులోనికి తీసుకున్న తరువాత సుమారు 18 గంటల పాటు జార్ఖండ్‌ లో ప్రభుత్వమే లేదు. దీంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చంపై సోరెన్‌ గవర్నర్‌ కు లేఖ రాశారు.

బీజేపీ తమ బలాన్ని..

ఆ సమయంలో గవర్నర్‌ తమ నిర్ణయాన్ని వెల్లడించాడనికి కొంత సమయం తీసుకున్నారు. దీంతో ప్రతిపక్ష బీజేపీ తమ బలాన్ని చూపడానికి సన్నాహాలు చేస్తుండటంతో పాలక కూటమి తమ ఎమ్మెల్యేలను రహస్యంగా తరలించింది. ఈ క్రమంలోనే వాతావరణం అనుకూలించక విమానాలు తెలంగాణకు వెళ్లలేదు.

గవర్నర్‌ నుంచి పిలుపు..

దీంతో ఎమ్మెల్యేలను సాయంత్రం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటికే చంపై సోరెన్‌కు గవర్నర్‌ నుంచి పిలుపు వచ్చింది. జార్ఖండ్ లోని అధికార జేఎంఎం-కాంగ్రెస్‌ - ఆర్జేడీ కూటమి 81 మంది సభ్యులలో 47 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉంది.

ఇక్కడ మెజార్జీ మార్క్‌-41 . ప్రస్తుతం 43 మంది ఎమ్మెల్యేలు చంపై సోరెన్‌ కు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ బీజేపీకి మొత్తంగా 25 మంది ఎమ్మెల్యేలు, ఏజేఎస్‌యూ (లేక) ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు ముగ్గురు ఉన్నారు. మిగిలిన స్థానాలు NCP మరియు ఒక లెఫ్ట్ పార్టీ (ఒక్కొక్కటి) మధ్య ఉన్నాయి. అంతేకాకుండా ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.

అధికార కూటమిలో ఆందోళన..

స్వల్ప మెజారిటీతో అధికార కూటమిలో ఆందోళన నెలకొంది. బుధవారం హేమంత్‌ సోరెన్‌ అరెస్టుకు ముందు నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు తమకే సంఖ్యాబలం ఉందని నేతలు పట్టుబడుతున్నారు. "మా మద్దతుతో 43 మంది ఎమ్మెల్యేలతో నివేదికను సమర్పించాము. సంఖ్య 46-47కు చేరుకుంటుందని మేము భావిస్తున్నాము... కాబట్టి ఎటువంటి సమస్య లేదు. మా కూటమి చాలా బలంగా ఉంది". అంటూ చంపై సోరెన్ వివరించారు.

బుధవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి తన పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ₹ 600 కోట్ల భూ కుంభకోణం, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని లాండరింగ్‌ చేయడంలో ఆయనకు సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.

Also read: అధిక బరువుతో బాధపడుతుంటే..ఉదయాన్నే ఈ గింజల నీటిని తాగితే చాలు!

#cm #champai-soren #jarkhand #hemanth-soren #governer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి