అల్లు అర్జున్‌ని కలిసి అభినందించిన గవర్నర్ దత్తాత్రేయ

69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీకి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అల్లు అర్జున్‌ని కలిసి అభినందించారు.

అల్లు అర్జున్‌ని కలిసి అభినందించిన గవర్నర్ దత్తాత్రేయ
New Update

69 ఏళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో బన్నీకి అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సినీ సెలబ్రెటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పుష్పరాజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మెగా ఫ్యామిలీ హీరోలందూ బన్నీని కలిసి సత్కరించారు. తాజాగా హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అల్లు అర్జున్‌ని కలిసి అభినందించారు. ఏకంగా హైదరాబాద్‌లోని బన్నీ ఇంటికి వెళ్లి మరీ ప్రత్యేకంగా అభినందించడం విశేషం. పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించిన దత్తన్న కాసేపు బన్నీతో ముచ్చటించారు. భారతీయ సినిమాలో తెలుగు ఇండస్ట్రీ ఎదుగుదల గురించి ఇద్దరు సంభాషించుకున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

publive-image

2021లో విడుదలైన పుష్ప చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్‌. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ అవార్డు దక్కించుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన పుష్ప మూవీలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా అద్భుతంగా నటించారు. ఇందులో ఊరమాస్‌ రోల్‌ చేశాడు. ఇక సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన రెండో పార్ట్ పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

publive-image

అటు ఆస్కార్‌.. ఇటు జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్న తొలి తెలుగు సినీ కళాకారులుగా సరికొత్త చరిత్ర సృష్టించారు చంద్రబోస్‌, కీరవాణి. ఇక ‘నాటు నాటు’ పాట ఎప్పుడు రిలీజ్ అయ్యిందో అప్పటి నుంచి అది ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది, మాస్‌ పదం కావడంతో అది అందరి మనసుల్లోకి ఈజీగా వెళ్లిపోయింది. అమెరికా, యూరప్‌ దేశాల్లో స్క్రీనింగ్‌లన్నింటిలో ఈ పాట ప్రేక్షకులను అలరించింది. అందరిని డ్యాన్స్ చేసేలా చేసింది. పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి వివిధ దేశాల్లోని థియేటర్‌లో ఈ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించేవి. ఈ పాట అంతలా అందరి మనసుల్లో తిష్టవేసుకోవడానికి ప్రధాన కారణం కీరవాణి, చంద్రబోస్. ఇప్పుడా ఇద్దరికి ఒకే ఏడాదిలో రెండు బెస్ట్ అవార్డులు లభించాయి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe