Andhra Pradesh : ధర్మారెడ్డి, విజయ్ కుమార్‌రెడ్డిలపై విజిలెన్స్ విచారణకు ఆదేశం తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ అరెస్ట్ కాక తప్పదని చెబుతున్నారు. By Manogna alamuru 11 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి AP Government Ordered Investigation On Dharma Reddy - Vijay Kumar Reddy : ధర్మారెడ్డి, విజయకుమార్ రెడ్డిలు పదవీకాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డి మీద టీడీపీ (TDP) నాయకులు..విజయ్ కుమార్ రెడ్డి మీద జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి. ధర్మారెడ్డి రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త ప్రభుత్వం వచ్చాకనే ఉద్యోగ విరమణ చేశారు. మరోవైపు కేంద్రంలో చేరేందుకు విజయ్ కుమార్ ఢిల్లీకి వెళ్ళారు. అయితే ఆయనను వెంటనే వెనక్కు రావాలని విజిలెన్స్ ఆదేశించడంతో తిరిగి వచ్చారు. ఇప్పుడు ధర్మారెడ్డి విజయ్ కుమార్‌ల అవినీతి మీద విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ (Vigilance Department) దర్యాప్తు చేయడమే కాకుండా... వారిని విచారించాలని కూడా అనుకుంటున్నారు. దానికన్నా ముందు వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో పాటూ దర్యాప్తులో భాగంగా వారి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులనూ విచారణ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీవాణి టిక్కెట్ల అమ్మకంలో అక్రమాలు .. టీటీడీ (TTD) ని అడ్డం పెట్టుకుని వైసీపీకి విరాళాలు సేకరించారని, బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్ కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు అభియోగాలు చేశారు. ఇక విజయకుమార్ మీద సమాచార శాఖలో ప్రకటనల పేరిట కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. Also Read:Bihar: మీ కాళ్ళు మొక్కుతా..దయచేసి పని చేయండి-సీఎం నితీష్ చర్య #ap-tdp #ttd #vijay-kumar-reddy #vigilance-officers #dharma-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి