Small Savings Schemes: స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీరేట్లు మారలేదు.. వివరాలు ఇవే!

ప్రభుత్వం పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్ స్కీమ్స్ వంటి స్కీమ్స్ వడ్డీరేట్లను వచ్చే త్రైమాసికం అంటే ఏప్రిల్-జూన్ 2024 కు యథాతథంగా ఉంచింది. ఈ స్కీమ్స్ వడ్డీరేట్లు మారవు. ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం ఈ వడ్డీరేట్లను సమీక్షిస్తుంది 

Small Savings Schemes: స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీరేట్లు మారలేదు.. వివరాలు ఇవే!
New Update

Small Savings Schemes: ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి (Q1FY25) అన్ని చిన్న పొదుపు పథకాల(స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్) వడ్డీ రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం (మార్చి 8) ఈమేరకు నోటిఫికేషన్ జారీచేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి, ఏప్రిల్ 1, 2024 నుండి జూన్ 30, 2024తో ముగిసే చిన్న మొత్తాల పొదుపు పథకాల(Small Savings Schemes) వడ్డీ రేట్లు యధాతథంగా అంటే ఇప్పుడు ఉన్నట్లే  ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. FY 2023-24 చివరి త్రైమాసికం (జనవరి 1, 2024 నుండి మార్చి 31, 2024 వరకు) కోసం నోటిఫై చేసిన వడ్డీరేట్లే కొనసాగుతాయి. 

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1% వడ్డీ రేటు..
ఏప్రిల్-జూన్ 2024-25 త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై 7.1% వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల(Small Savings Schemes) వడ్డీ రేట్లను నిర్ణయించే ముందు ప్రభుత్వం దేశంలోని లిక్విడిటీ పరిస్థితి అలాగే, ద్రవ్యోల్బణంపై కూడా ఒక కన్నేసి ఉంచుతుంది. అయితే, PPF, NSC, KVP సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తారు.  చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 4% నుండి 8.2% వరకు ఉంటాయి.

ఇంతకు ముందు డిసెంబరులో..
2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల(Small Savings Schemes) వడ్డీ రేట్లను డిసెంబర్ 29న ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు సుకన్య సమృద్ధి యోజన 0.20% పెరిగింది అలాగే, 3 సంవత్సరాల కాల డిపాజిట్ రేట్లు 0.10% పెంచారు. అయితే ఇతర పథకాల రేట్లు మాత్రం మారలేదు.

ఇంతకుముందు, ప్రభుత్వం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం కోసం  RD పై రేట్లను 0.20% పెంచింది. ఇంతకుముందు సుకన్య స్కీమ్ వడ్డీ రేటు 8%, మూడేళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 7%గా ఉంది. ఈ పథకాల రేట్లు పెరగడం ఇది వరుసగా ఆరవ త్రైమాసికం. ఆర్థిక మంత్రిత్వ శాఖ వరుసగా తొమ్మిది త్రైమాసికాలుగా చిన్న పొదుపు పథకాల(Small Savings Schemes) వడ్డీ రేట్లను మార్చలేదు. దీని తరువాత, ఇది అక్టోబర్-డిసెంబర్ 2022 నుండి పెరగడం ప్రారంభమైంది.

చిన్న పొదుపు పథకం వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తారు..
స్మాల్ సేవింగ్స్ పథకాల(Small Savings Schemes) వడ్డీ రేట్లను నిర్ణయించే ఫార్ములాను శ్యామలా గోపీనాథ్ కమిటీ ఇచ్చింది. మెచ్యూరిటీ ఉన్న ప్రభుత్వ బాండ్ల రాబడి కంటే ఈ పథకాల వడ్డీ రేట్లు 0.25-1.00% ఎక్కువగా ఉండాలని కమిటీ సూచించింది. వీటిని ప్రతి మూడునెలలకు ఒకసారి సమీక్షించి మార్పులు చేర్పులు చేస్తారు. 

Also Read: బంగారం కొనాలంటే ఇప్పట్లో అయ్యేలా లేదు.. ధరల మోత ఆగడం లేదు!

ఈ పథకాలు ఇంటి పొదుపులో పెద్ద భాగం..
భారతదేశంలో గృహ పొదుపులో చిన్న పొదుపు పథకం(Small Savings Schemes) ప్రధాన వనరుగా ఉంది.  ఇందులో 12 రకాల పొదుపు సాధనాలు (సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్)ఉన్నాయి. ఈ పథకాలలో, డిపాజిటర్లు తమ డబ్బుపై స్థిర వడ్డీని పొందుతారు. అన్ని చిన్న పొదుపు పథకాల నుండి సేకరణలు నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ (NSSF)లో జమ చేస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు ప్రభుత్వ లోటును తీర్చే వనరులుగా మారాయి. 

చిన్న పొదుపు సాధనాలను మూడు భాగాలుగా విభజించవచ్చు:

  • పోస్టల్ డిపాజిట్: సేవింగ్ ఖాతా, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, నెలవారీ ఆదాయ పథకం
  • పొదుపు సర్టిఫికేట్: నేషనల్ స్మాల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) , కిసాన్ వికాస్ పత్ర (KVP)
  • సామాజిక భద్రతా పథకాలు: సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
#savings #governemnt-schemes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe