TDP: కోడి కత్తి డ్రామా అట్టర్ ప్లాప్.. అధికారం కూటమిదే.. బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

వైసీపీ దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. జగన్మోహన్ రెడ్డి మరో కోడి కత్తి డ్రామా చేద్దామని చూశారని అయితే, ఆ డ్రామా అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. అధికారం కూటమిదేనన్నారు.

New Update
TDP: కోడి కత్తి డ్రామా అట్టర్ ప్లాప్.. అధికారం కూటమిదే..  బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. తన ప్రచారం వార్ వన్ సైడ్ గా రాజమండ్రి రూరల్ లో కొనసాగుతుందన్నారు. జనమంతా ఈ దుర్మార్గపు పాలనను అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి అభ్యర్థులైన నన్ను, ఎంపీగా పురందేశ్వరిని గెలిపించుకోవడానికి ప్రజల ముందుకు వస్తున్నారని తెలిపారు. అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని సాగనంపడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉందని పేర్కొన్నారు.

Also Read: విద్యార్థులకు శుభవార్త.. వేసవి సెలవులు వచ్చేశాయ్..

రాజమండ్రి రూరల్ లో తాను ఎటువంటి అభివృద్ధి చేశాను అని కూడా పాంప్లెట్ రూపంలో చూపిస్తున్నానన్నారు. చెల్లి బోను వేణుగోపాలకృష్ణ రామచంద్రపురం నుంచి తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చారని విమర్శలు గుప్పించారు. రాజమండ్రి రూరల్ ప్రజలు ఆయన్ని స్వాగతించేందుకు ప్రజలందరూ ముందుకు రావడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి మరో కోడి కత్తి డ్రామా.. చేద్దామని చూశారని అయితే, అట్టర్ ప్లాప్ అయిందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు