Google Lumiere : స్క్రిప్ట్ ఇస్తే చాలు.. వీడియో రెడీ.. AIతో గూగుల్ సంచలనం మంచి స్క్రిప్ట్ చేతిలో ఉన్నా వీడియో చేయాలంటే బోలెడు సమయం.. ఖర్చు. ఇప్పుడు గూగుల్ ఆ బాధ లేకుండా చేస్తోంది. గూగుల్ లూమియర్ AI సహాయంతో స్క్రిప్ట్ ఇస్తే వీడియో అవుట్ పుట్ వచ్చే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనితో ఫొటోను కూడా వీడియోగా సులువుగా మార్చుకోవచ్చు. By KVD Varma 28 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Google Lumiere AI : మీరు ఒక వీడియో చేయాలని అనుకున్నారు. స్క్రిప్ట్ రాసి.. దానికి సంబంధించిన విజువల్స్, గ్రాఫిక్స్ రెడీ చేసుకుని.. వాటిని ఎడిట్ చేసి.. అబ్బా బోలెడు పని కదా. కానీ, ఇప్పుడు మీ ఆలోచనల్ని జస్ట్ రాయండి అంతే.. అది వీడియోగా మీ ముందుకు నిమిషాల్లో వచ్చేస్తుంది. మీ అందమైన ఫోటోను నిమిషంలో వీడియోగా మార్చేసుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే AIతో గూగుల్ తీసుకువచ్చిన అద్భుతమైన టెక్నాలజీ. అవును.. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో టెక్స్ట్ రాయడం ద్వారా నేరుగా వీడియోలను రెడీ చేసుకోగలుగుతారు. ఇందుకోసం గూగుల్ తన సరికొత్త AI మల్టీ మోడల్ లూమియర్‌ను విడుదల చేసింది. Google కొత్త AI మోడల్ టెక్స్ట్-టు-వీడియో అలాగే ఇమేజ్-టు-వీడియో(Image-to-Video) మోడల్(Google Lumiere) అద్భుతాన్ని తీసుకువచ్చింది. ఇది రియల్.. వివిధ రకాల చలనాలను సృష్టించడం ద్వారా వీడియోలను తయారు చేయగలదు. అంటే, దీనితో మీరు నేరుగా టెక్స్ట్ నుండి వీడియోని సృష్టించవచ్చు, అదేవిధంగా ఏదైనా ఇమేజ్ నుంచి మోషన్ వీడియోని కూడా సృష్టించవచ్చు. Also Read : తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి! దీనికోసం మీరు లూమియర్‌లో, మీరు టెక్స్ట్ లేదా ఫోటోను ఇన్‌పుట్ చేయాలి అంతే. AI న్యూరల్ నెట్‌వర్క్ వీడియోను సృష్టించి మీకు అందిస్తుంది. అంతేకాదు.. ఇది ఇమేజ్ లను యానిమేట్ చేయడానికి అలాగే ఇమేజ్‌లు లేదా పెయింటింగ్‌ల ఫార్మాట్‌లతో వీడియోలను రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడల్ ఇమేజీలు, వీడియోలను ప్రత్యేక యానిమేషన్లు అదేవిధంగా పెయింటింగ్‌లుగా రూపొందించడానికి కూడా వీలవుతుంది. లూమియర్ మోడల్ ఎలా పని చేస్తుందంటే.. Google కొత్త లూమియర్ సాంప్రదాయ వీడియో మోడల్‌లా కాకుండా, ఒక్కో ఫ్రేమ్‌కి మొత్తం వీడియోను ఉత్పత్తి చేసే స్పేస్-టైమ్ U-నెట్ ఆర్కిటెక్చర్‌ను ఎడాప్ట్ చేసుకుంది. ప్రస్తుతం ఉన్న AI వీడియో మోడల్‌లు ఒక సమయంలో చాలా దూరంగా కీ ఫ్రేమ్‌లను సింథసైజ్ చేస్తాయి. కానీ, ఈ వినూత్న సాంకేతికత తాత్కాలిక సూపర్-రిజల్యూషన్ తర్వాత సుదూర కీఫ్రేమ్‌లను సంశ్లేషణ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. దీనితో, వీడియోలో స్థిరత్వం సులభంగా వస్తుంది. Google కొత్త లూమియర్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి: Your browser does not support the video tag. గూగుల్ రీసెర్చర్స్(Google Researchers) చెబుతున్న దాని ప్రకారం, టెక్స్ట్-టు-వీడియో(Text-to-Video) జనరేషన్ ఫ్రేమ్‌వర్క్ ముందుగా శిక్షణ పొందిన టెక్స్ట్-టు-ఇమేజ్ డిఫ్యూజన్ ఉపయోగించి పరిచయం చేస్తున్నారు. స్పేస్-టైమ్ U-నెట్ ఆర్కిటెక్చర్‌ని అమలు చేయడం ద్వారా బృందం పూర్తి ఫ్రేమ్ వీడియో క్లిప్‌లను రూపొందించింది. ఇది ప్రాదేశిక - తాత్కాలిక మాడ్యూళ్ళను కలిగి ఉంటుంది. ఇది ఇమేజ్ టు వీడియో, వీడియో ఇన్‌పెయింటింగ్. స్టైలైజ్డ్ జనరేషన్‌లో మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది గూగుల్. త్వరలోనే గూగుల్ లూమియర్ సంచలనం ప్రారంభం కావచ్చు. Also Read : రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా..! Watch This Interesting Video : #google #ai-technology #google-lumiere మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి