Google Chrome: క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!

భారత ప్రభుత్వ భద్రతా సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT-In) ఒక ముఖ్యమైన సెక్యూరిటీ అలెర్ట్‌ జారీ చేసింది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ ఓల్డ్ వెర్షన్లను ఉపయోగించే యూజర్లు అప్రమత్తం కావాలని పేర్కొంది.

New Update
Google Chrome: క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక!

ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ (Google Chrome) భారతదేశంలో కూడా సూపర్ పాపులర్ అయింది. ఈ బ్రైజర్‌ని కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరూ పెద్ద రిస్క్‌లో పడ్డారు. వారికోసం భారత ప్రభుత్వ భద్రతా సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT-In) ఒక ముఖ్యమైన సెక్యూరిటీ అలెర్ట్‌ జారీ చేసింది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ ఓల్డ్ వెర్షన్లను ఉపయోగించే యూజర్లు అప్రమత్తం కావాలని పేర్కొంది. ఎందుకంటే ఈ పాత వెర్షన్లలో కొన్ని లోపాలు ఉన్నాయి, వీటిని హ్యాకర్లు దుర్వినియోగం చేసి, యూజర్ కంప్యూటర్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు, వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు లేదా భద్రతా వ్యవస్థలను దాటి పెద్ద హాని తలపెట్టవచ్చు.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో పలు సమస్యలు గుర్తించినట్లు ఏప్రిల్ 29 నాటి CERT-In సెక్యూరిటీ అలర్ట్ వెల్లడించింది. అవి హ్యాకర్లకు కంప్యూటర్‌పై దాడి చేయడానికి అవకాశం ఇస్తాయి. ఈ లోపాలను ఉపయోగించి, హ్యాకర్లు డినైల్‌ ఆఫ్ సర్వీస్ (DoS) కండిషన్స్‌కు దారి తీయవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. యూజర్ కంప్యూటర్‌ను నెమ్మదిగా లేదా పనిచేయకుండా చేయవచ్చు.

CERT-In విడుదల చేసిన నోట్ ప్రకారం, ఈ లోపాలు క్రోమ్‌లో మూడు కారణాల వల్ల ఏర్పడ్డాయి. అందులో మొదటిది యాంగిల్ (Angle)లో టైప్ కన్ఫ్యూజన్. ఇది ఒక రకమైన సమస్యలు, దీనిలో ఒక ప్రోగ్రామ్ ఒక వేరియబుల్‌ని తప్పుగా అర్థం చేసుకుంటుంది, దీని వల్ల హ్యాకర్లు ఆ వేరియబుల్‌ను నియంత్రించుకోవచ్చు. రెండోది V8 APIలో ఔట్ ఆఫ్ బౌండ్స్ రీడ్. ఈ సమస్య హ్యాకర్లకు క్రోమ్ బ్రౌజర్ మెమరీని యాక్సెస్ చేసి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి లేదా కంప్యూటర్‌ను నాశనం చేయడానికి అనుమతిస్తుంది. మూడోది యూజ్‌ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ డాన్ (Dawn). ఈ సమస్య హ్యాకర్లకు క్రోమ్ బ్రౌజర్‌ను క్రాష్ చేయడానికి లేదా దానిని నియంత్రించడానికి అనుమతిస్తుంది.

తాజా గూగుల్ క్రోమ్ భద్రతా హెచ్చరిక ప్రకారం, కొన్ని గూగుల్ క్రోమ్ వెర్షన్లను ఉపయోగిస్తున్న వ్యక్తులు భద్రతా లోపాలకు గురయ్యే ప్రమాదం ఉంది. వారు గూగుల్ క్రోమ్ 124.0.6367.78 కంటే ఓల్డ్ వెర్షన్లు ఉపయోగిస్తున్న విండోస్, మ్యాక్ యూజర్లు. గూగుల్ క్రోమ్ 124.0.6367.78 కంటే ఓల్డ్ వెర్షన్లు వాడుతున్న లైనక్స్ యూజర్లు. ఈ లోపాలను హ్యాకర్లు దుర్వినియోగం చేసుకోవడం ద్వారా కంప్యూటర్‌పై దాడి చేయవచ్చు.

* అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయండిలా

క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి.

మెనూ > సెట్టింగ్స్‌ > అబౌట్ సెక్షన్‌కు వెళ్లాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు