తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త.. ఈ విషయాలు తెలుసుకోండి

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసే భక్తులు ప్రస్తుతం ఎలాంటి వెయిటింగ్ లేకుండా ఈజీగా దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ తగడంతో టీటీడీ అధికారులు నో వెయిటింగ్ రూల్‌ అమలు చేస్తున్నారు.

New Update
తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..  ఈ విషయాలు తెలుసుకోండి

తగ్గిన భక్తుల రద్దీ.. 

కలియుగ దైవం, ఏడుకొండలవాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం ప్రపంచం నలమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. మొన్నటిదాకా వేసవి సెలవులు ఉండటంతో తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24గంటలకు పైగా సమయం పట్టేది. ప్రస్తుతం పాఠశాలలు ఓపెన్ కావడం, వర్షాలు పడుతుండటంతో భక్తుల రద్దీ తగ్గింది. ఈ నేపథ్యంలో కొండకు చేరే భక్తులు క్యూలైన్‌లో ఎక్కడా వేచి ఉండకుండా నేరుగా స్వామివారి దర్శనం చేసుకునేంత ఖాళీగా ఉంది. టీటీడీ అధికారులు కూడా నో వెయిటింగ్ రూల్ అమలు చేస్తున్నారు. రద్దీ తగ్గడంతో భక్తులను కంపార్ట్మెంట్‌లలో వెయిట్ చేయించకుండా వచ్చిన వారిని వచ్చినట్లు దర్శనానికి అనుమతిస్తున్నారు. శ్రీవారిని ఆదివారం 85,258 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా కానుకలు రూ. 4.28 కోట్ల ఆదాయం వచ్చింది. స్వామివారికి 25,451 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కిటకిటిలాడిన తిరుమల కొండపై ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గింది.

ఆగస్టు నెల ఉత్సవాలు.. 

ఆగస్టు నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు అధికారులు. ఆగస్టు 1న పౌర్ణమి గరుడ సేవ, ఆగస్టు 12- మతత్రయ ఏకాదశి, ఆగస్టు 15-శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం, ఆగస్టు 21- గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ, ఆగస్టు 22- కల్కి జయంతి, ఆగస్టు 25-తరిగొండ వెంగమాంబ వర్ధంతి, వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 26- శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు పవిత్రోత్సవాలు, ఆగస్టు 30- శ్రీ విఖనస మహాముని జయంతి, శ్రావణపౌర్ణమి, ఆగస్టు 31-హయగ్రీవ జయంతి.. తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు.

స్టీల్ హుండీలు ఏర్పాటు.. 

మరోవైపు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఇకపై స్టీల్ హుండీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. జులై 29న ఐదు అడుగుల స్టీల్​హుండీని ప్రయోగాత్మకంగా పరిశీలించారు అధికారులు. ప్రస్తుతం భారీ గంగాళాలు హుండీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే భక్తుల ముసుగులో వస్తున్న దొంగలు హుండీలలో నగదు వేస్తున్నట్లు నటిస్తూ దొంగతనం చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. అందుకే స్టీల్ హుండీలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది. ఈ స్టీల్ హుండీలకు మూడు వైపుల కానుకలు వేసేందుకు వీలు ఉంటుంది. మధ్యలో ఓ ఇనుప రాడ్ ​ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు