అమెరికాకు చెందిన ఓ ప్రముఖ కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఈ డీల్ వచ్చినట్లు విప్రో పేర్కొంది. ఆ సంస్థ ఉత్పత్తుల డెవలప్‌మెంట్‌తో పాటు నిర్వహణ సేవలు కూడా అందించనున్నట్లు చెప్పింది. కాగా ఈ భారీ ఒప్పందం విలువ 4 వేల 175 కోట్లు అని వెల్లడించింది. 5 ఏళ్లపాటు సదరు కంపెనీకి తాము సర్వీస్ ఆఫర్ చేయనున్నట్లు స్పష్టం చేసింది.
సంస్థను వేగంగా వృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పనిస్తున్నామని విప్రో కొత్త CEO శ్రీనివాస్ పలియా ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పుడు భారీ డీల్ సొంతం చేసుకుంది. ఇది కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కఠిన పరిస్థితుల్లోనూ భారత IT రంగం వృద్ధిని చూసి పలు దేశాలు కుళ్లుకుంటున్నాయి.