/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ttd-2-jpg.webp)
TTD: టీటీడీ పాలకమండలి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. అటవీ కార్మికుల జీతాలు కూడా పెంచుతామన్నారు. అలాగే వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.
Also Read: జ్ఞానవాపి మసీదు కేసు.. సంచలన తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు!
ఈ నేపధ్యంలోనే టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్ లు ప్రింటింగ్ చేయనుంది. స్విమ్స్ లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు ఏర్పాటు చేస్తానన్నారు. టీటీడీలోని అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీ పై భోజన సదుపాయం..రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. సూపెర్వైజర్ పోస్టులతో పాటు క్రింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం చేయనుంది. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోక్కాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని అనుకుంటుంది. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు..!
ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమల్లోని అతిధి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు 3సంవత్సరాలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు..15లక్షలతో తండ్లకు బంగారు తాపడం చేయనున్నారు. వెంకటశివ కృష్ణ ప్రసాద్ పదవి కాలం మూడు సంవత్సరాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునికరణ చేస్తారన్నారు.