తిరుమల భక్తులకు శుభవార్త..!

తిరుమలలో వివిధ సేవలను పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. మధ్య దళారుల జోక్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు దేవస్థానం కొత్త పథకాన్ని తీసుకురానుంది.ఇందుకోసం ఆధార్, జియో, టీసీఎస్, తితిదే ఐటీ శాఖ అధికారులను సంప్రదించింది.

New Update

దర్శనం టికెట్లు, గదులు ఇతర సౌకర్యాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.కానీ మధ్య దళారుల జోక్యంతో దీన్ని అడ్డుకునేందుకు కొత్త ప్లాన్‌ వేసేందుకు ఆలోచిస్తున్నారు. కొత్త పథకం ప్రకారం భక్తుల ఆధార్ నంబర్లను ఉపయోగించాలని నిర్ణయించారు.ఆధార్ నంబర్ స్కీమ్‌తో దళారుల జోక్యాన్ని పూర్తిగా తొలగిస్తామని అధికారులు తెలిపారు.ఈ  కేసుల్లో ప్రమేయమున్న బ్రోకర్లను వారం రోజుల్లోగా చట్ట ప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు