Jobs: నిరుద్యోగులకు మంత్రి తుమ్మల శుభవార్త.. ఖమ్మంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..!! ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగులకు మంత్రి శుభవార్త చెప్పారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో 150 ఖాళీల భర్తీకి ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. By Bhoomi 08 Jan 2024 in జాబ్స్ ఖమ్మం New Update షేర్ చేయండి Jobs: ఖమ్మం(Khammam) జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao). ఉపాధి కల్పశాఖ (Department of Employment)ఆధ్వర్యంలో పలు ప్రైవేట్ సంస్థల్లో మొత్తం 150 ఖాళీల ను భర్తీ చేసేందుకు ఈ నెల 10 వ తారీఖ నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా(Social media account )ద్వారా ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ చేసినవారు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చు. పేటీఎం అండ్ రిలయన్స్ జియో (Paytm and Reliance Jio)కంపెనీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఖమ్మం జల్లా ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 10వ తారీఖు నుంచి ఈ జాబ్ మేళను మోడల్ కెరీర్ సెంటర్ వద్ద నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలని జిల్లా ఉపాధి కల్పనశాఖాధికారి కొండప్పలి శ్రీరామ్ తెలిపారు. 10వ తారీఖు ఉదయం 10.00గంటల నుంచే ఇంటర్వ్యూ కొరకు సర్టిఫికేట్స్ తో హాజరు కావాలని కోరారు. రిలయన్స్ జియో: రిలయన్స్ జియో రిక్రూట్ చేసుకునే ఉద్యోగాలు టెలికాలర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ లీడర్ పోస్టులకు పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ చేసి 10 నుంచి 40ఏళ్ల వయస్సు మధ్య ఉన్న యువతీ యువకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జీతం రూ. 10వేల నుంచి రూ. 30వేల వరకు చెల్లించనున్నారు. పేటీఎం: పేటీఎం సేల్స్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ లీడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతీ యువకులు అర్హులు. వీరికి రూ. 18వేల నుంచి 30వేల వరకు జీతం చెల్లించనున్నారు. ఇది కూడా చదవండి: పేదలకు గుడ్ న్యూస్.. శివరాత్రికి కొత్త రేషన్ కార్డులు? #tummala-nageswara-rao #jobs #social-media-account మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి