Breaking: రైతులకు గుడ్ న్యూస్.. పంట రుణాలు మాఫీ ..!

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరుగుతోంది. గతేడాది డిసెంబర్ 9 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతు భరోసా మార్గదర్శకాలపై సైతం ఈ కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

New Update
Breaking: రైతులకు గుడ్ న్యూస్.. పంట రుణాలు మాఫీ ..!

Breaking: తెలంగాణలో పంట రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏక కాలంలోనే పంట రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. కాగా, పంట రుణాల మాఫీకి రూ. 40 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. రుణమాఫీతో  47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మరికొద్ది సేపట్లో రుణమాఫీకి సంబంధించిన పూర్తి విధివిధానాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు