భానుడి భగభగలకు తెలంగాణ అంతటా ఒంటిపూట బడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 15 నుంచి రాష్ట్రమంతటా ఒంటిపూట బడులు అమలులోకి రాగా.. ఏప్రిల్ 23తో ముగుస్తాయి.తర్వాత రోజు నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు (TS Schools Summer Holidays)ఉండే అవకాశం ఉంది. జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెన్(Schools Reopen) అవుతాయని అధికారులు అంటున్నారు. వేసవి సెలవులపై ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ తెలిపింది.
ఇటీవల ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్ఏ2 పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసి.. ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీన పూర్తవుతాయి.ఒకటి నుంచి 7 వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.45 నిమిషాల వరకు .. 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తున్నారు.వీటి ఫలితాలను 23వ తేదీన విడుదల చేసి.. అదే రోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తారు. ఇలా మొత్తం తెలంగాణలో 45 రోజులకు పైగా వేసవి సెలవులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రత ఇలానే కొనసాగితే ఈ వేసవి సెలవులను కూడా పొడిగించే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇక ఏపీలో కూడా ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్కూల్స్ వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వరుకు ఈ వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్‌కి 50 రోజులు పాటు ఈ సారి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.గత ఏడాది తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వేసవి సెలవులను ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే.అలాగే ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే. గత ఏడాది వేసవి సెలవులు తక్కువగానే ఇచ్చారు.