Special Trains : సమ్మక్క సారక్క భక్తులకు గుడ్ న్యూస్...మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు..!!

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క భక్తులకు గుడ్ న్యూస్. మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి 24వరకు స్పెషల్ ట్రైన్స్ భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

New Update
Trains Cancelled: వందేభారత్‌ తో పాటు 22 రైళ్లు రద్దు!

SAMMAKKA SAARAKKA :  తెలంగాణ కుంభమేళాకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే భక్తులు మేడారం చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్నభక్తులతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అయితే భక్తుల సౌకర్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని మేడారం జాతరకు ప్రత్యేక రైళ్ల(Special Trains) ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తెలిపింది. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ వరంగల్, నిజామాబాద్ వరంగల్, సిర్పూర్ కాగజ్ నగర్ వరంగల్ మార్గంలో రైళ్లు నడుస్తాయని తెలిపారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, కామారెడ్డి, మనోహారబాద్, మేడ్చల్, ఘన్ పూర్, ఆలేరు ప్రాంతాలకు చెందిన వారికి ఈ స్పెషల్ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్ సిర్పూర్ కాగజ్ నగర్ (07017/07018), సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్ మధ్య (07014/07015) నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (7019/07020) రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. దీనిలో బాగంగానే జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటు జాతర ఏర్పాట్ల కోసం రూ. 3కోట్లను కేటాయించినట్లు వివరించారు.

ఇది కూడా చదవండి:క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

అటు  తెలంగాణ(Telangana) కుంభమేళా మేడారం మహా జాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లుండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ అధికారులు ఛార్జీలు కూడా నిర్ణయించారు.

ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీ స్కీం(Mahalaxmi Scheme Free Bus) మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇక పురుషుల కోసం ఆర్టీసీ అధికారులు ఛార్జీలు విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన మేరకు బస్సులు నడిపే సెంటర్, కిలోమీటర్లు, పెద్దలు, చిన్నారులకు సంబంధించిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

1.హనుమకొండ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు ఉండగా.. పెద్దలకు ఛార్జీ 250, చిన్నారులకు 140 గా బస్ ఛార్జీ నిర్ణయించారు

2. కాజీపేట నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

3. వరంగల్ నుంచి మేడారం జాతర 110 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

4. జనగామ నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 370, చిన్నారుల ఛార్జీ: 210

5. హైదరాబాద్ నుంచి మేడారం 259 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 550, చిన్నారుల ఛార్జీ: 310

6. హైదరాబాద్ పరిధిలోని మిగతా ప్రాంతాల నుంచి మేడారం 274 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 600, చిన్నారుల ఛార్జీ: 320

7. స్టేషన్ ఘన్ పూర్ నుంచి మేడారం జాతర 140 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 180

8. నర్సంపేట నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 150

9. కొత్తగూడ నుంచి మేడారం జాతర 137 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 170

10. పరకాల నుంచి మేడారం జాతర 107 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250, చిన్నారుల ఛార్జీ: 140

11. చిట్యాల నుంచి మేడారం జాతర 115 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 250 , చిన్నారుల ఛార్జీ: 140

12. మహబూబాబాద్ నుంచి మేడారం జాతర 155 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190

13. గూడూరు నుంచి మేడారం జాతర 125 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 280 , చిన్నారుల ఛార్జీ: 160

14. తొర్రూరు నుంచి మేడారం జాతర 165 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 350 , చిన్నారుల ఛార్జీ: 190

15. వర్ధన్నపేట నుంచి మేడారం జాతర 133 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 300, చిన్నారుల ఛార్జీ: 160

16. ఆత్మకూరు నుంచి మేడారం జాతర 90 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 210 , చిన్నారుల ఛార్జీ: 120

17. మల్లంపల్లి నుంచి మేడారం జాతర 75 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 180 , చిన్నారుల ఛార్జీ: 110

18. ములుగు నుంచి మేడారం జాతర 60 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150, చిన్నారుల ఛార్జీ: 90

19. భూపాలపల్లి నుంచి మేడారం జాతర 100 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 220, చిన్నారుల ఛార్జీ: 130

20. ములుగు గణపురం నుంచి మేడారం జాతర 80 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 200 , చిన్నారుల ఛార్జీ: 110

21. జంగాలపల్లి నుంచి మేడారం జాతర 55 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 150 , చిన్నారుల ఛార్జీ: 90

22. పస్రా నుంచి మేడారం జాతర 30 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 80 , చిన్నారుల ఛార్జీ: 50

23. గోవిందరావుపేట నుంచి మేడారం జాతర 35 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 100 , చిన్నారుల ఛార్జీ: 60

24. తాడ్వాయి నుంచి మేడారం జాతర 16 కిలోమీటర్లు.. పెద్దల ఛార్జీ: 60 , చిన్నారుల ఛార్జీ: 40

Also Read : నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు.. బైడెన్ సంచలన ఆరోపణలు..

Advertisment
తాజా కథనాలు