రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా?

రేషన్ కార్డులను ఇచ్చి, ఆ కార్డుల ఆధారంగా కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది.గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడూ అమలు చేస్తూ ఉంది.అలాంటి ఐదు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా?

పేదరిక రేఖ (BPL)కు దిగువన ఉన్న వారికి చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి రేషన్ కార్డులను ఇచ్చి, ఆ కార్డుల ఆధారంగా కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు రకరకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పేదవారికి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్టీయే ప్రభుత్వమే మూడోసారి అధికారంలో ఉంది కాబట్టి.. గతంలో అమలు చేసిన పథకాలనే ఇప్పుడూ అమలు చేస్తూ ఉంది.

ఆయుష్మాన్ భారత్ యోజన అనేది భారత కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఈ స్కీమ్ కింద బిపిఎల్ కుటుంబాలు ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించారు. ఈ కార్డు ద్వారా, పేద కుటుంబానికి ప్రతీ సంవత్సరం ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్‌మెంట్ లభిస్తుంది. మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటే, మీరు ఆయుష్మాన్ భారత్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు రాగానే, మీరు ప్రయోజనాలు పొందవచ్చు.

ప్రతి ఒక్కరూ ఇల్లు కావాలని కలలుకంటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద BPL కుటుంబాలు రూ.1,20,000 వరకు సబ్సిడీని పొందుతాయి. తాజాగా, ఈ పథకం కింద 3 కోట్ల కొత్త కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మీరు వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటే, ఈ కొత్త పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద బిపిఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు, ఉచిత గ్యాస్ స్టవ్ ఇస్తున్నారు. అలాగే గ్యాస్ రీఫిల్‌పై ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. మీరు రీఫిల్‌పై రూ.300 వరకు సబ్సిడీని పొందవచ్చు. త్వరలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన మూడో దశ కోసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. వీటికి అప్లై చేసుకుంటే, కొత్త వారికి కూడా ఉచిత గ్యాస్ బండ, గ్యాస్ స్టవ్ లభిస్తాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు