Christmas Celebrations: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. క్రిస్మస్ వేడుకల్లో కనిపించిన క్లింకార.. ఫొటో వైరల్!

మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్, స్నేహ ఈ పార్టీనీ హోస్ట్ చేశారు. మెగా కజిన్స్ వరుణ్ తేజ్, లావణ్య , నిహారిక, వైష్ణవ్, సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ఈ పార్టీలో రాంచరణ్, ఉపాసన కూతురు క్లింకారతో కలిసి ఉన్న ఫొటో వైరలవుతుంది.

New Update
Christmas Celebrations: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త.. క్రిస్మస్ వేడుకల్లో కనిపించిన క్లింకార.. ఫొటో వైరల్!

Mega Family Christmas Celebrations: డిసెంబర్ 5 న ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రెటీలు కూడా క్రిస్మస్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మెగా కజిన్స్ అంతా కలిసి క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రిస్మస్ పార్టీనీ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు హోస్ట్ చేశారు. ఈ పార్టీలో మెగా కజిన్స్ సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, లావణ్య, నిహారిక, శిరీష్, రామ్ చరణ్, ఉపాసనతో పాటు మహేష్ బాబు వైఫ్ నమ్రత పిల్లలు సితార, గౌతమ్ కూడా పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులు కలిసి ఉన్న ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించి నెట్టింట్లో మరో ఫోటో వైరల్ గా మారింది.

publive-image

క్రిస్మస్ వేడుకల్లో ఉపాసన, రాంచరణ్ కూతురు క్లింకారతో కలిసి ఉన్న ఫొటో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఫొటోలో ఉపాసన చేతిలో తమ పెట్ రైమ్, రామ్ చరణ్ చేతిలో తమ బేబీ క్లింకార ఉన్నారు. కానీ ఈ ఫొటోలో కూడా క్లింకార రివీల్ చేయలేదు. గతంలో చాలా సార్లు క్లింకార ఉన్న ఫోటోలు షేర్ చేశారు కానీ ఎక్కడ కూడా మొహం చూపించలేదు. రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య పెళ్ళిలో.. మెగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఫొటోలో.. క్లింకార మొహం నీళ్లలో కనిపించింది అంటూ ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఇప్పటికీ రామ్ చరణ్, ఉపాసన క్లింకార ఫేస్ రివీల్ చేయలేదు. క్లింకార రాంచరణ్, ఉపాసన లో ఎవరి పోలికతో ఉండబోతుందా అని చూడడానికి మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Also Read:  Salaar Collections Day 3: సలార్‌ కలెక్షన్ల ఊచకోత.. రూ. 400 కోట్లతో బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ ప్రకంపనలు!

Advertisment
తాజా కథనాలు