LIC: ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లకు కేంద్రం గొప్ప శుభవార్త

కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఉద్యోగులు, ఏజెంట్లకు కేంద్రం వినాయకచవితి కానుక అందించింది. గ్రాట్యుటీ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే తిరిగి నియమితులైన ఏజెంట్లకు రెన్యూవల్ కమీషన్‌కు అర్హత కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

New Update
LIC: ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లకు కేంద్రం గొప్ప శుభవార్త

LIC: కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఉద్యోగులు, ఏజెంట్లకు కేంద్రం వినాయకచవితి కానుక అందించింది. గ్రాట్యుటీ పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే తిరిగి నియమితులైన ఏజెంట్లకు రెన్యూవల్ కమీషన్‌కు అర్హత కల్పిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా టర్మ్ ఇన్సూరెన్స్ కవర్, కుటుంబ పెన్షన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీ కోసం పనిచేస్తున్న 13 లక్షల మందికిపైగా ఏజెంట్లు, లక్ష మందికిపైగా ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

గ్రాట్యుటీ పరిమితి రూ.5లక్షలకు పెంపు..

ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం ఎల్‌‌ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ పరిమితిని రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రస్తుతం రూ.3 వేల నుంచి 10 వేల రూపాయల వరకు ఉండగా.. దీనిని రూ. 25 వేల నుంచి రూ. రూ.1.50 లక్షలకు పెంపుదల చేసింది. ఇక ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం అందరికీ ఒకే తరహా 30 శాతం కుటుంబ పెన్షన్ అందజేస్తామని తెలిపింది. మరోవైపు రీ-అపాయింట్ అయిన ఏజెంట్లకు రెన్యూవల్ కమీషన్‌కు అర్హత కల్పిస్తున్నట్లు వెల్లడించింది. తాజా ప్రోత్సాహకాలతో మరింత ఉత్సాహంగా ఉద్యోగులు, ఏజెంట్లు పనిచేసే అవకాశం ఉంటుందని వివరించింది.

కేంద్రం నిర్ణయంపై ఉద్యోగులు, ఏజెంట్లు హర్షం..

ఇటీవల జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎల్‌ఐసీ నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 9,544 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో లాభం కేవలం రూ. 683 కోట్లుగానే ఉండేది. ఇంత బలమైన వ్యాపారంగా లాభాలు గడించడంలో ఉద్యోగులు, ఏజెంట్లు పాత్ర కీలకమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ప్రయోజనాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం పట్ల ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 1956వ సంవత్సరంలో రూ. 5 కోట్ల మూలధనంతో ఏర్పాటైన ఎల్ఐసీ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదగడం విశేషం.

ఇది కూడా చదవండి: జస్ట్ రూ. 50 వేలు ఉంటే కొత్త కారు మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే..

Advertisment
Advertisment
తాజా కథనాలు