TS News : రైతులకు గుడ్ న్యూస్..1వ తారీఖు నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు..!

తెలంగాణ రైతులకు శుభవార్త. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ముహుర్తం ఖారారు చేసింది సర్కార్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు.

TS News : రైతులకు గుడ్ న్యూస్..1వ తారీఖు నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు..!
New Update

TS News : తెలంగాణలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,149కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 75.20లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ మేరకు యాసంగి ధార్యం సేకరణపై పలు జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఎఫ్ఐసీ అధికారులు, పౌరసరఫరాలు, వ్యవసాయ మార్కెటింగ్, పోలీసు శాఖ అధికారులతో శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సీజన్ లో రాష్ట్రంలో 66లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. 121 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసారు. ఇందులో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు 75లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం వస్తుందని అంచాన వేశారు. గతేడాది కంటే ఈ సారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు మిల్లింగ్ మొత్తం పూర్తి చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలవరీ వచ్చేలా చర్యలు తీసుకోవలని ఆదేశించారు.

అప్పులు, వడ్డీ భారం దృష్ట్యిలో ఉంచుకోని సకాలంలోనే సీఎంఆర్‌ డెలివరీలు, బకాయిల రికవరి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైస్‌మిల్లర్లు, రేషన్‌ డీలర్లు, ఇతరత్రా ప్రైవేటు వ్యక్తులెవరూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనిపించకూడదన్నారు. ప్రభుత్వ సిబ్బంది మినహా ఇతర వ్యక్తులు ఎవరైనా కొనుగోలు కేంద్రాల్లో కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎఫ్‌సీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ధాన్యం సేకరణ చేయాలని, ఇష్టారాజ్యంగా తరుగు తీసి రైతులను ఇబ్బంది పెట్టొదన్నారు. గతేడాదికి సంబంధించి 35లక్షల టన్నుల ధాన్యాన్ని టెండర్ల ప్రక్రియలో విక్రయించామని తెలిపారు. తక్షణమే ధాన్యం లిఫ్టింగ్‌ చేయించాలంటూ అధికారులను ఆదేశించారు. పాత ధాన్యం నిల్వలు ఎక్కడైనా ఉండి, నాణ్యత ఉంటే మిల్లింగ్‌ చేసిస్తే తీసుకుంటామన్నారు. ధాన్యం, బియ్యంలో నాణ్యత లేకపోతే సీఎంఆర్‌ తీసుకునేది లేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల పీడీఎస్‌ అవసరాలకు పంపిస్తే తెలంగాణ బ్రాండ్‌ దెబ్బతింటుందన్న ఆయన... నాణ్యత లేని బియ్యాన్ని తెలంగాణ ప్రజల ఆహార అవసరాలకు సరఫరా చేయలేమని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి:  త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి.!

#ts-news #yasangi-crop
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe