Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ ఇవే..!!

అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 22 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్, నర్సాపూర్, కాచిగూడ, నుంచి కొల్లాం, కొట్టాయం మధ్య నడపనున్నట్లు తెలిపింది.

New Update
Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు 22 స్పెషల్ ట్రైన్స్.. డేట్స్, టైమింగ్స్ ఇవే..!!

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే వేరువేరు ప్రాంతాలను కలుపుతూ మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆయా రైళ్లు సర్వీసులందించే రైళ్ల తేదీలు, సమయం, ఇతర వివరాలను సోమవారం విడుదల చేసింది. సికింద్రాబాద్-కొల్లం, నర్సాపూర్ -కొట్టాయం, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్- కొట్టాయం, కొల్లం-సికింద్రాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నిర్ధేశించిన సమయాలు, రోజుల్లో రాకపోకలను సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతోపాటు స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

publive-image

ప్రత్యేక రైళ్ల తేదీ, సమయాలు :

సికింద్రాబాద్ -కొల్లం-సికింద్రాబాద్ ( 07129/07130)
ఈ రైలు 26వ తేదీ ఆదివారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 4. 30 ప్రారంభమై మరుసరటి రోజు సోమవారం 11.55నిమిషాలకు గమ్యం చేరుకుంటుంది.

ట్రైన్ నెంబర్ 07130
సికింద్రాబాద్ నుంచి కొల్లం ..కొల్లం నుంచి సికింద్రాబాద్

ట్రైన్ నెంబర్ 07119 / 07120
నర్సాపూర్ - కొట్టాయం -నర్సాపూర్

ట్రైన్ నెంబర్ 07123/07124
కాచిగూడ - కొల్లం -కాచిగూడ

ట్రైన్ నెంబర్ ( 07127/07128)
సికింద్రాబాద్ - కొల్లం - సికింద్రాబాద్

ట్రైన్ నెంబర్ (07126/07126)
కాకినాడ్ టైన్ - కొట్టాయం- కాకినాడ

ఇది కూడా చదవండి: మేమే కింగ్ మేకర్..మాకెవరు అడ్డు…మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Advertisment
తాజా కథనాలు