Aloevera Gel: అలోవెరా జెల్‌ని ముఖానికి రాసుకుని నిద్రపోతారా? జరిగేది ఇదే! రాత్రి నిద్రపోయే ముందు అలోవెరా జెల్‌ని ముఖానికి వాడటం మంచిది. రాత్రి నిద్రించే ముందు కలబంద జెల్‌ను అప్లై చేస్తే చర్మం తాజాగా మారుతుంది. ముడతలను తగ్గించి మొటిమలను తొలగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ట్రై చేయండి! By Vijaya Nimma 26 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Aloevera Gel: అలోవెరా జెల్ ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో అలోవెరా జెల్ ఒకటి. ఇది ముఖంపై ఉన్న ముడతలను తగ్గించి ముఖాన్ని అందంగా చేయడంలో బెస్ట్ జెల్‌గా చెబుతారు. అయితే దీనిని ముఖానికి రాసుకుకున్నా.. తిన్నా ఎన్నో లాభాలు ఉంటాయి. కొందరు ముఖానికి రాత్రిపూట అలోవెరా జెల్‌ను రాసుకుంటారు. ఇలా రాసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయేమో అని కొందరు భయపడుతూ ఉంటారు. అయితే అలోవెరా జెల్‌ను ఎప్పుడు రాసుకోవాలి..? ఎలా రాసుకోవాలో..? రాత్రిపూట కలబంద జెల్‌ని ముఖానికి రాసుకుని నిద్రించడం వల్ల ముఖానికి మేలు జరుగుతుందో లేదో.. దానిపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. చర్మ సంరక్షణ అలోవెరా జెల్‌ను వాడే విధానం: రాత్రి నిద్రపోయే ముందు అలోవెరా జెల్‌ని ముఖానికి వాడటం మంచిదే. ఈ విషయంలో గందరగోళం అవసరం లేదు. రాత్రి నిద్రించే ముందు కలబంద జెల్‌ను అప్లై చేస్తే చర్మానికి మేలు జరుగుతుందట. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అలోవెరా జెల్ ముఖంపై ముడతలను తగ్గించి మొటిమలను తొలగిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రాత్రిపూట అలోవెరా జెల్‌ను ముఖంపై అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే కొందరికి అలోవెరా జెల్ వల్ల అలర్జీ రాచ్చే అవకాశం ఉంది. ముఖంపై ఏదైనా ఉత్పత్తిని ఉపయోగిస్తుంటే.. అలోవెరా జెల్‌ను ముఖంపై పూయడం మానుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతిచర్యకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: ప్రతిరోజూ పాలు తాగితే కొన్ని రోజుల్లో మీ చర్మం తలాతలా మెరిసిపోతుంది! #aloevera-gel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి