2 సెంటీమీటర్ల తేడాతో అగ్రస్థానం కోల్పోయిన.. గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రా ఖతార్ రాజధాని దోహాలో డైమండ్ లీగ్ సిరీస్ జరిగిన జావెలిన్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రెండు సెంటీమీటర్ల దూరంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు.చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాట్లెడ్జ్ 88.38 మీటర్ల జావెలిన్ త్రోతో మొదటి స్థానంలో నిలిచాడు. By Durga Rao 11 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఖతార్ రాజధాని దోహాలో డైమండ్ లీగ్ సిరీస్ జరిగిన జావెలిన్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా పాల్గొన్నాడు. అతను రెండవ స్థానంలో నిలిచాడు. ఈ పోటీలో నీరజ్ చోప్రా రెండు సెంటీమీటర్ల తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాట్లెడ్జ్ 88.38 మీటర్ల జావెలిన్ త్రోతో మొదటి స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా తన చివరి త్రోలో 88.36 మీటర్లు విసిరాడు. దీంతో నీరా చోప్రా రెండు సెంటీమీటర్ల తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండో స్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. “నేను 88కి పైగా త్రో చేయటం బాగానే అనిపించింది. ఈ స్థానంతో నేను సంతృప్తి చెందాను. కానీ నా ప్రయత్నాల పట్ల నాకు సంతృప్తి లేదు. మరింత కష్టపడాలి. బహుశా తదుపరి మ్యాచ్‌లో నేను చాలా విసురుతాను' అని నీరజ్ చోప్రా అన్నాడు. "ఈ రోజు నేను దీన్ని (90 మీటర్లు త్రో) చేయగలనని భావించాను, కానీ నేను చేయలేకపోయాను. బహుశా దేవుడు నన్ను వేరే చోట చేయాలనుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. నా స్థిరమైన ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నాను. త్వరలో 90 మీటర్ల కంటే ఎక్కువ త్రో చేస్తాను" అని అతను చెప్పాడు. అలాగే 2016, 2017, 2023లో మూడు సార్లు డైమండ్ లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జాకుబ్‌పై ప్రశంసలు కురిపించాడు.‘‘జాకుబ్‌తో పోటీపడడం ఎప్పుడూ గొప్పే. అతడు మంచి స్నేహితుడు, నేను అతన్ని చాలా అభిమానిస్తాను’’ అని నీరజ్ చోప్రా అన్నాడు. #neeraj-chopra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి