Shamshabad Airport: అతి తెలివి అడ్డంగా బుక్ చేసింది.. అక్కడ దాచిపెట్టిన గోల్డ్‌ని ఈజీగా పట్టేసిన అధికారులు..

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్‌కు 819 గ్రాముల బంగారం తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బంగారాన్ని మిక్సర్ లో దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేస్తుండగా అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

New Update
Shamshabad Airport: అతి తెలివి అడ్డంగా బుక్ చేసింది.. అక్కడ దాచిపెట్టిన గోల్డ్‌ని ఈజీగా పట్టేసిన అధికారులు..

Gold Seized In Shamshabad Airport: కేటుగాళ్లు రోజు రోజుకు మరింత రాటుతేలిపోతున్నారు. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని రకాల కట్టడి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. స్మగ్లర్లు మాత్రం నయా ఐడియాలతో రెచ్చిపోతున్నారు. వివిధ మార్గాలలో బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఫలితంగా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి రోజు బంగారం, డ్రగ్స్‌ వంటివి పట్టుబడుతునే ఉన్నాయి. శనివారం 5 కేజీల నార్కోటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవాళ మిక్సర్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని సీజ్ చేశారు . పట్టుకున్న 819 గ్రాముల బంగారం విలువ రూ. 49 లక్షల 80 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు