Gold Rates Hike: ఓహ్.. భగ్గుమన్న బంగారం ధరలు.. వెండి ధరల జిగేల్! ఎంతంటే.. 

బంగారం ఈరోజు (డిసెంబర్ 15) షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1000లు పెరిగి రూ.57,650లకు, 24 క్యారెట్ల బంగారం రూ.1090లు పెరిగి రూ.62,890లకు చేరుకున్నాయి. వెండి కూడా కేజీకి ఏకంగా 2500 రూపాయలు పెరిగి రూ.79,500ల వద్ద ఉంది.

New Update
Gold Rates Hike: ఓహ్.. భగ్గుమన్న బంగారం ధరలు.. వెండి ధరల జిగేల్! ఎంతంటే.. 

Gold Rates Hike: బంగారం ధరలు రెండు రోజులు కాస్త కాస్త తగ్గుతూ వచ్చాయి అని సంబరపడేలోపు మళ్ళీఒక్కసారిగా భగ్గుమన్నాయి.  రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు దిగివస్తుండటంతో మరింత తగ్గుతాయని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది మూడు రోజుల వరుస తగ్గుదలకు బ్రేక్ వేస్తూ ఈరోజు అంటే శుక్రవారం (డిసెంబర్ 15) ఒక్కసారిగా భారీగా పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు సహజమే. ఇప్పుడు భారీగా బంగారం పెరగడం కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది.  వరుస తగ్గుదల నేపథ్యంలో ఇంకా తగ్గుతుందని భావించారు. కానీ, అంతర్జాతీయంగా బంగారం ధరలు(Gold Rates Hike) భారీగా పెరుగుతుండడంతో పాటు డిమాండ్ కూడా పెరగడంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. బంగారం కంటే స్పీడ్ గా ధరలు పెరుగుతూ వచ్చాయి. ఒక స్టేజ్ లో కేజీ వెండి ధర 80 వేల రూపాయలకు చేరుకునేలా కనిపించింది. ఈ వారంలో వరుసగా తగ్గుతూ వచ్చింది. బంగారం ధరల్లానే వెండి ధరలు కూడా అదుపులోకి వస్తున్నాయి అని అనుకునే లోపే.. ఒక్కసారిగా ఈరోజు కేజీకి 1000 రూపాయలు పెరిగి షాక్ ఇచ్చింది. ఈరోజు అంటే శుక్రవారం (డిసెంబర్ 15) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Also Read: మహిళలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి రూ. 6వేలు..సర్కార్ అందిస్తున్న ఈ సాయం గురించి మీకు తెలుసా..?

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Hike) ఏకంగా రూ. 1000లు పెరిగింది. దీంతో రూ.57,650లకు చేరుకుంది.  24 క్యారెట్ల బంగారం కూడా భారీగా రూ.1090ల వరకూ పెరిగింది. దీంతో రూ.62,890ల వద్ద నిలిచింది. అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1000 రూపాయలు పెరిగి రూ.57,800ల వద్ద ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Hike) 1090 రూపాయలు పెరిగి రూ.63,040లకు చేరుకుంది. 

ఇక వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి ఏకంగా 2500 రూపాయలు పెరిగింది.  రూ.79,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ లోనూ వెండి రేటు భారీగా పెరిగి రూ.75,800ల వద్ద ఉంది. 

అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు(Today Gold Rates) ఈరోజు భారీగా పెరిగాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rates Hike)  2032 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర 24.09 డాలర్లుగా ఉంది. బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 

గమనిక: బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు