Gold Rates Hike: ఆగని బంగారం ధరల పరుగు.. 80వేలకు దగ్గరలో వెండి..

బంగారం ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. మరోవైపు వెండి ధరలు తగ్గేదే లే అన్నట్టు పరుగులు తీస్తున్నాయి. ఒక్కరోజులో ఏకంగా కేజీ వెండి ధర 1500 రూపాయలు పెరిగింది. దీంతో 80 వేల రూపాయలకు కాస్త తక్కువగా నిలిచింది.

New Update
Gold Rates Hike: ఆగని బంగారం ధరల పరుగు.. 80వేలకు దగ్గరలో వెండి..

Gold Rates Hike: బంగారం ధరల పరుగు ఆగలేదు. పండగ సమయంలో వరుసగా దాదాపు పది రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం.. ఇప్పుడు వరుసగా పెరుగుతూ పోతోంది. గత ఐదు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొద్దీ కొద్దిగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు భారీగానే పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం ఎక్కడా తగ్గేదే లే.. అన్నట్టుగా దూసుకుపోతున్నాయి. హైదరాబాద్ లో కిలో 80 వేల రూపాయలకు దగ్గరలో వెండి ధరలు ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూ ఉండడం.. దేశీయంగా డిమాండ్ పెరగడం బంగారం ధరల ఈ పరుగుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఇక మన దేశంలో ఈరోజు (నవంబర్ 18) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బంగారం, వెండి ధరలు(Gold Rates Hike) పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ .473 పెరిగి రూ .60,978 కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.355 పెరుగుదలతో రూ.73,210కు ఎగసింది. ఈ నెలలో ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. నవంబర్ 1న 10 గ్రాముల బంగారం ధర రూ.60,896 ఉండగా, ప్రస్తుతం రూ.60,978కి చేరింది. అదేసమయంలో ఈ నెలలో ఇప్పటి వరకు వెండి ధర రూ.2,385 పెరిగింది. నవంబర్ మొదటి రోజు రూ.70,825 వద్ద ఉన్న ధర ఇప్పుడు 10 గ్రాములకు రూ.73,210కి చేరింది.

Also Read: ఆర్బీఐ కొత్త రూల్.. ఇక క్రెడిట్ కార్డ్.. పర్సనల్ లోన్ సరదా తీర్చేస్తాయి..

హైదరాబాద్ లో ఇలా..

హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో నాలుగు రోజులుగా ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. దీంతో హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తూ వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు పెరిగి రూ.56,550ల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధార కూడా 10 గ్రాములకు 650 రూపాయలు పెరిగి 61,690 రూపాయలుగా ఉంది.

ఇదిలా ఉంటె వెండి ధరలు మాత్రం బాబోయ్ అనిపించేలా పెరిగిపోయాయి. నాలుగు రోజులుగా వేడి ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఎంతలా అంటే మూడు రోజుల్లో కేజీ వెండి ధర 2,600 రూపాయలు పెరిగింది. ఈరోజు ఏకంగా 1500 రూపాయలు పెరిగిన వెండి 79,500 రూపాయలకు చేరుకుంది.

గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు