బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సామాన్యులు కొనే పరిస్థితి లేదు. కేవలం 20 రోజుల్లో పది గ్రాముల బంగారం మూడు వేల రూపాయలకు పైగా పెరిగిపోయింది. గత పదిహేను రోజుల్లో రెండు రోజులు మాత్రమే బంగారం ధరలు కాస్త తగ్గినట్టు కనిపించాయి. వాస్తవానికి ఆ తగ్గుదల కూడా పెద్ద లెక్కలోకి వచ్చేటంత కాదు. మరి బంగారంలో పెట్టుబడి(Investment in Gold) పెట్టాలి అని అనుకునేవారికి ఇది సరైన సమయమేనా? ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే బంగారంపై ఎంత పెట్టాలి? నిపుణులు చెప్పిన విషయాలను మనం అర్ధం చేసుకుందాం.
పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమా?
బంగారంలో పెట్టుబడులు(Investment in Gold) పెట్టడానికి ఇదే సరైన సమయమా అనే ప్రశ్న కూడా మీ మనసులో ఉంటే, బంగారం ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటున్నాయో ఒకసారి పరిశీలించాలి. చైనా దూకుడుగా బంగారం కొనుగోలు చేయడంతో పాటు అమెరికా ఫెడ్ రేట్లు తగ్గుతాయనే ప్రచారం ఇందుకు ప్రధాన కారణాలుగు చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఈ కారణాలన్నింటి కారణంగా, ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులు సురక్షితమైన పొదుపు కోసం బంగారంపై పెట్టుబడి(Investment in Gold) పెడుతున్నారు. అందువల్ల, బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఎందుకంటే బంగారం ధరలు నగదు ప్రవాహంపై ఆధారపడవు. కానీ డిమాండ్ - సరఫరా, భౌగోళిక రాజకీయ పరిస్థితి , ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి.
Also Read: పసిడి ప్రియులకు శుభవార్త.. రూ.6 వేలు తగ్గనున్న ధర.. ఎప్పుడో తెలుసా?
అమెరికాలో ఫెడ్ రేట్లు జూన్ నెలలో ప్రకటిస్తారు. అటువంటి పరిస్థితిలో, జూన్ తర్వాత బంగారం మార్కెట్లో కరెక్షన్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే కరెక్షన్ జరిగితే బంగారం ధర కాస్త తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, సాధారణ పెట్టుబడిదారులు లేదా చిన్న పెట్టుబడిదారులు ఇప్పుడు అధిక స్థాయిలో బంగారం(Investment in Gold) కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
బంగారంపై ఎంత పెట్టుబడి పెట్టొచ్చు?
ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న వస్తుంది. బంగారంపై రాబడుల చరిత్రను పరిశీలిస్తే, గత దశాబ్దంలో 11 శాతం వరకు వార్షిక రాబడిని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం చాలా అస్థిరతతో కొడుకున్నది ఆలాగే ప్రమాదకరం కూడా. అయితే, దానితో పోల్చితే, బంగారం చాలా సురక్షితమైన పెట్టుబడి. ఇది మాత్రమే కాదు, చిన్న లేదా కొత్త పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం కష్టం, ఎందుకంటే వారికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై పెద్దగా అవగాహన ఉండదు. ఆ కోణంలో చూస్తే దీర్ఘకాలంలో బంగారం మంచి పెట్టుబడి(Investment in Gold) ఎంపికగా ఉంటుంది.
ఇప్పుడు మీరు బంగారంలో ఎంత పెట్టుబడి పెట్టాలి అనే సందేహం కూడా వస్తుంది. నిజానికి ఎవరిదైనా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా ఉంచుకోవడానికి బంగారం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది రిస్క్ తగ్గిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10 నుండి 15 శాతం బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచి పద్ధతి. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇవ్వడంతో పాటు భద్రతను కూడా అందిస్తుంది.
నిజానికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్(Investment in Gold) అనేది దీర్ఘకాలిక పెట్టుబడికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. స్వల్పకాలిక లక్ష్యాలను ఆశించి బంగారంలో పెట్టుబడి పెట్టడం అంత సరైన పని కాదు. బంగారం విషయంలో గత అనుభవాలు దీనిని ధృవీకరిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఆలోచించేవారు బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చని వారంటున్నారు. జూన్ తరువాత కొంత కరెక్షన్ తీసుకున్నప్పటికీ పెద్దగా తేడా ఉండకపోవచ్చనేది వారి మాట.
అయితే, ఇది కేవలం సూచన మాత్రమే. నిపుణులు అందించిన సూచనల ఆధారంగా ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మీ పెట్టుబడిని ప్లాన్ చేయడానికి ముందు, మీరు మీ పెట్టుబడి సలహాదారుని లేదా ఫైనాన్షియల్ ఎడ్వైజర్ ని సంప్రదించడం మంచిది.