Gold rate today: మన దేశంలో బంగారంపై విపరీతమైన మోజు ఉంటుంది. పండుగ సమయాల్లో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. అందులోనూ దీపావళి పండుగ అంటే బంగారం కొనాలని చాలామంది పరుగులు తీస్తారు. అందుకే ఎప్పుడూ దీపావళి పండుగ సమయంలో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. అయితే, ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. బంగారం ధరలు బాగా దిగివచ్చాయి. పండుగ వారంలో ప్రతి రోజూ బంగారం ధరలు కింది చూపులే చూశాయి. పండగ వెళ్లిన వెంటనే బంగారం ధరల్లో పెరుగుదల ప్రారంభం అయింది. వరుసగా ప్రతిరోజూ బంగారం ధరలు కాస్త కాస్తగా పెరుగుతూనే వస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం దీనికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. మూడురోజుల్లోనే రెండువేల రూపాయలకు పైగా కేజీ వెండి ధర పైకెగసింది. బులియన్ మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం బంగారం ధరల్లో పెరుగుదల కొన్నిరోజులు కొనసాగవచ్చు.
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. దీని ఎఫెక్ట్ దేశీయంగా కూడా కనిపించింది. బంగారం ధరలు(Gold rate today) ఈరోజు (నవంబర్ 17)న అంతర్జాతీయంగా ఔన్స్ కు 40 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో 1984 డాలర్ల వద్దకు చేరుకుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే 2000 డాలర్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక దేశీయంగా గత మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం దూసుకుపోతున్నాయి.
హైదరాబాద్ లో ఈరోజు రేట్లు ఇలా..
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో మూడురోజులుగా ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. దీంతో హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. అయితే ఈరోజు మాత్రం ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950ల వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధార కూడా 10 గ్రాములకు 62,400 రూపాయల వద్ద నిలిచింది.
Also Read: ఎలాన్ మస్క్ కంపెనీ ఒక్కరోజులో ఎంత డబ్బు సంపాదించిందో తెలుస్తే షాక్ అవుతారు..!!
ఇదిలా ఉంటె వెండి ధరలు మాత్రం బాబోయ్ అనిపించేలా పెరిగిపోయాయి. మూడురోజులుగా వేడి ధరలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఎంతలా అంటే మూడు రోజుల్లో కేజీ వెండి ధర 2,600 రూపాయలు పెరిగింది. ఈరోజు 300 రూపాయలు పెరిగిన వెండి 78 వేల రూపాయలను చేరుకుంది.
ఢిల్లీలో ఇలా..
ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం వరుసగా మూడోరోజు పెరిగాయి. అక్కడ బంగారం ధర(Gold rate today) 22 క్యారెట్లు.. 10 గ్రాములకు రూ.56,100ల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 61,190 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక కిలో వెండి ధర ఢిల్లీలో 300 రూపాయలు పెరిగి 75 వేల రూపాయల వద్దకు చేరుకుంది.
గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం.
Watch this Interesting Video: