Gold rate today: గత పదిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. పదిరోజుల తరువాత బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. దీపావళి ముందు ధరలు తగ్గడంతో పసిడి ప్రియులకు సంబరాన్ని ఇచ్చింది. ఇప్పుడు ధరలు తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. మళ్ళీ బంగారం ధరలు పెరుగుదల బాటలోకి వచ్చినట్టేనా అంటే.. అందుకు ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక మన దేశంలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ఉంది. దీంతో బంగారం ధరల్లో పెరుగుదల కంటిన్యూ కావచ్చని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. దీని ఎఫెక్ట్ దేశీయంగా కూడా కనిపించింది. బంగారం ధరలు(Gold rate today) ఈరోజు (నవంబర్ 15)న అంతర్జాతీయంగా ఔన్స్ కు 15 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో 1962 డాలర్ల వద్దకు చేరుకుంది.
Also Read: గుడ్ న్యూస్.. బంగారం ధరలు కిందికి.. వారంలో ఎంత తగ్గిందంటే..
హైదరాబాద్ లో ఈరోజు రేట్లు ఇలా..
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. దీంతో హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో రూ.55,550లకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధార కూడా 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగి 60,600 రూపాయల వద్ద ఉంది.
మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్ లో కిలో వెండి 600 రూపాయలు పెరిగి 76,000 రూపాయలకు చేరుకుంది.
ఢిల్లీలో ఇలా..
ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. అక్కడ బంగారం ధరలు(Gold rate today) 22 క్యారెట్లు.. 10 గ్రాములకు రూ.55,700లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 60,750 రూపాయల వద్దకు చేరింది. ఇక కిలో వెండి ధర ఢిల్లీలో 600 రూపాయలు పెరిగి 63 వేల రూపాయల వద్ద ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం.
Watch this interesting Video: