Gold Rate Review: గత వారంలో దిగివచ్చిన బంగారం.. ఎగసిన వెండి ధరలు.. 

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.  హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,400ల వద్ద స్థిరంగా నిలిచాయి. ఇక వెండి ధర కూడా మార్పులు లేకుండా  రూ.78,000 వద్ద ఉంది

Gold Rate Review: గత వారంలో దిగివచ్చిన బంగారం.. ఎగసిన వెండి ధరలు.. 
New Update

Gold Rate Review: గత వారం రోజుల్లో బంగారం ధరలు కాస్త కిందికి దిగి వచ్చాయి. వారం ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు వారం చివరిలో కాస్త పైకెగశాయి. కానీ, మొత్తం మీద చూసుకుంటే పోయిన వారంలో బంగారం ధరలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. పెళ్ళిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ పెరిగినప్పటికీ బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. మరోవైపు గత శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు శుక్ర, శని వారాల్లో కాస్త పెరుగుదల నమోదు చేశాయి. 

అంతర్జాతీయంగా బంగారం ధరలు (Gold Rate Review)పెరుగుదల చూపిస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం వారం చివరలో  దేశీయంగానూ కనిపించింది. గత  వారం అంతా  దాదాపుగా తగ్గుతూనే వచ్చిన బంగారం ధరలు వారం చివరలో షాక్ ఇచ్చాయి.  ఫిబ్రవరి 12 సోమవారం నుంచి ఫిబ్రవరి 18 ఆదివారం వరకూ బంగారం ధరలను పరిశీలిస్తే.. సోమవారం అంటే ఫిబ్రవరి 12 ప్రారంభ ధర కంటే, ఫిబ్రవరి 18 ఆదివారం ముగింపు ధర చూస్తే, కొద్దిగా తగ్గింది అనే చెప్పాలి.  బంగారం ధరల(Gold Rate) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించడం .. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం డిమాండ్ పెరుగుతూ ఉండడం వారం చివరలో బంగారం ధరలపై ప్రభావం చూపించిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు వెండి ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. వారం ప్రారంభంలో తగ్గుదల కనబరిచినప్పటికీ.. వారం చివరికి వచ్చేసరికి బంగారం ధరలు భారీగా పెరిగాయి. వారం చివరలో వరుసగా మూడురోజుల పాటు వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. గత వారంలో బంగారం, వెండి ధరలు (Gold Rate Review) దేశీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.             

 గత వారంలో హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ..
హైదరాబాద్(Hyderabad) లో గత వారం ప్రారంభంలో అంటే సోమవారం (ఫిబ్రవరి 12న)  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Review) ప్రారంభ ధర 57,700 రూపాయలుగా ఉంది. వారం చివరిలో అంటే ఆదివారం ముగింపు ధర రూ.57,200ల వద్దకు చేరింది.  అంటే 500 రూపాయల తగ్గుదల గత వారం మొత్తంలో చూసుకుంటే కనిపించింది. ఇక 24 క్యారెట్ల బంగారం సోమవారం ప్రారంభ ధర 62,950 రూపాయలుగా ఉంది. వారం చివరలో అంటే ఆదివారం ముగింపు ధర 62,400 రూపాయలకు చేరింది. అంటే 500 రూపాయలు తగ్గింది.

 గత వారంలో ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate) వారం మొత్తంలో చూసుకుంటే తాగ్గాయి. గత వారం ప్రారంభంలో అంటే సోమవారం (ఫిబ్రవరి 12న)  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Review) ప్రారంభ ధర 57,850 రూపాయలుగా ఉంది. వారం చివరిలో అంటే ఆదివారం ముగింపు ధర రూ.57,350ల వద్దకు చేరింది.  అంటే 500 రూపాయల తగ్గుదల గత వారం మొత్తంలో చూసుకుంటే కనిపించింది. ఇక 24 క్యారెట్ల బంగారం సోమవారం ప్రారంభ ధర 63,100 రూపాయలుగా ఉంది. వారం చివరలో అంటే ఆదివారం ముగింపు ధర 62,550 రూపాయలకు చేరింది. అంటే 500 రూపాయలు తగ్గింది.  

Also Read : తగ్గినట్టే తగ్గి షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. 

 గత వారంలో వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Review) తగ్గుదల నమోదు చేస్తుంటే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి గత వారంలో. హైదరాబాద్ లో సోమవారం ప్రారంభ ధర 76,500 రూపాయలుగా ఉంది. వారం చివరికి వచ్చేసరికి అంటే ఆదివారం ముగింపు ధర 78,000 రూపాయలుగా నమోదు అయింది. అంటే కేజీ వెండి 1500 రూపాయల పెరుగుదల కనబరిచింది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు గత వారం భారీగా పెరిగింది. సోమవారం ప్రారంభ ధర 75,000 రూపాయలుగా ఉంది. వారం చివరికి వచ్చేసరికి అంటే ఆదివారం ముగింపు ధర 76,500 రూపాయలుగా నమోదు అయింది. అంటే కేజీ వెండి 1500 రూపాయల పెరుగుదల కనబరిచింది.  

మొత్తంగా  చూసుకుంటే గత వారం బంగారం ధరలు తగ్గుదల బాటలోనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు భారీగా పెరగడం కాస్త షాకిచ్చింది చెప్పాలి. ఈవారం కూడా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. 

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకున్నపుడు స్థానికంగా ఉన్న ధరలను పరిశీలించి చూసుకోవాలని సూచిస్తున్నాం.

Watch this Interesting Video:

#gold-rate #gold-rate-in-hyderabad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe