Gold Rate News: వరుసగా తగ్గుతూ వచ్చి హమ్మయ్య.. కాస్త కొనుక్కునేందుకు ఛాన్స్ వచ్చింది అని సంబరపడిన వారికి షాక్ ఇస్తూ ఒక్కసారిగా బంగారం ధరలు పైకెగశాయి. పోయిన నెలలో అంటే ఫిబ్రవరిలో కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం మార్చి నెల ప్రారంభం కాగానే పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనేఉంటాయి. అయితే, ఒక్కోసారి బంగారం ధరలు భారీగా పెరగడం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో ఒక్కసారిగా బంగారం ధరలు పెరగలేదు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ సందర్భాల్లో తగ్గుదలనే కనపరుస్తూ వచ్చాయి. కానీ, ఆ తగ్గుదల 100 రూపాయల 200 రూపాయల మధ్యలోనే జరుగుతూ వచ్చింది. అయితే, ఈరోజు మాత్రం ఒక్కసారిగా పది గ్రాములకు 310 రూపాయల పైనే పెరిగింది బంగారం ధర. బంగారం ధరల(Gold Rate News) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల తగ్గుదల.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఈరోజు అంటే మార్చి 2న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate News) బాగానే పెరిగింది. దీంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. బంగారం ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు నిన్న కాస్త పెరిగిన వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. ఈరోజు అంటే శనివారం (మార్చి 2) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate News) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) ధర 310 రూపాయలు పెరిగి రూ.57,900లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 330 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో రూ. 63,160ల వద్దకు ఎగసింది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate News) పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 10 గ్రాములకు 310 రూపాయలు పెరిగి రూ.58,050ల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పది గ్రాములకు 320 రూపాయలు పెరిగి రూ.63,310నమోదు అయింది.
Also Read : బంగారం మరింత కిందికి.. కొనాలంటే సూపర్ ఛాన్స్..
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today)తో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. వరుసగా రెండో రోజూ వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు పెరిగి రూ.76,200ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 300 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 74,500ల వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate today) 2083డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త తగ్గడంతో(Gold And Silver Price) ఔన్స్ 23 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి.