పెరిగితే అమాంతం.. తగ్గితే కాస్తంత.. బంగారం ధరల తీరిది. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలతో విలవిల లాడిన పసిడి ప్రియులకు నిన్న మార్పులు లేకుండా నిలిచిన బంగారం ధరలు ఊరట నిచ్చాయి. ఇక ఈరోజు బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఆశలు రేకెత్తుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరల్లో మార్పు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరల(Gold Rate)పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు వెండి ధరలు రెండోరోజూ మార్పులు లేకుండా నిలిచాయి.
సాధారణంగా బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, వారం క్రితం బంగారం ధరలు కాస్త తగ్గినట్టు కనిపించి ఊపిరి పీల్చుకున్న గోల్డ్ లవర్స్ కి షాకిస్తూ నిన్న మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. అయితే, ఈరోజు మార్పులు లేకుండా బంగారం ధరలు నిలిచాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు బంగారం ధర ల్లో మార్పులకు కారణంగా నిపుణులు చెబుతారు. ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి.
ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 30న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర తగ్గుదల నమోదు చేసింది. దీంతో దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపించింది. బంగారం ధరలు కాస్త తగ్గుదల కనబరిచాయి. మరోవైపు వెండి ధరలు అంతర్జాతీయంగా తగ్గాయి. అయితే దేశీయంగా మాత్రం వరుసగా రెండోరోజూ అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈరోజు అంటే మంగళవారం (ఏప్రిల్ 30) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate) 300 రూపాయలు తగ్గి రూ.66,550ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 330 రూపాయలు తగ్గింది. దీంతో రూ.72,600లుగా ఉంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త తగ్గుదల కనబరిచాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 300 తగ్గి రూ.66,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 330 రూపాయలు తగ్గి రూ.72,750ల వద్దకు చేరుకుంది.
Also Read : బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే..
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. మొన్నటివరకూ బంగారం ధరల (Gold Rate) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే, నిన్న స్థిరంగా నిలిచిన వెండి ధరలు ఈరోజు కూడా మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.87,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి రూ.84,000ల వద్ద స్థిరంగా ఉంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త తగ్గుదల నమోదు అయింది. ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,333.26 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 27.07డాలర్లకు చేరింది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.