/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-1-jpg.webp)
బంగారం ధరలు(Gold Rate) చాలా అనిశ్చితంగా కదులుతున్నాయి. ఏప్రిల్ నెల అంతా పెరుగుతూ రికార్డు స్థాయిలో పరుగులు తీసిన బంగారం ధరలు.. మే ప్రారంభం నుంచి కాస్త తగ్గుదల బాటలో పడినట్టు కనిపించాయి. హమ్మయ్య అని పసిడి ప్రియులు ఊపిరి తీసుకునేలోపు.. మళ్ళీ బంగారం ధరలు పెరగడం ప్రారంభం అయింది. కారణాలేమైనా బంగారం ధరలు మాత్రం కంగారు పెడుతూనే ఉన్నాయి. బంగారం కొనాలనుకునే వారి ఆశలపై నీళ్లుజల్లుతూనే ఉన్నాయి. నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. అంతకు ముందు రోజు కూడా పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు(Gold Rate) మళ్ళీ పెరుగుదల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి.
సాధారణంగా బంగారం ధరలు(Gold Rate) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ వచ్చి కాస్త ఆశలు రేపిన బంగారం ధరలు.. మొన్నటి సెషన్ లో పెరుగుదల కనబరిచి టెన్షన్ పెట్టాయి. నిన్న నిలకడగా నిలిచిన బంగారం ధరలు.. మళ్ళీ ఈరోజు పైకెగశాయి. బంగారం ధరల(Gold Rate) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు బంగారం ధర ల్లో మార్పులకు కారణంగా నిపుణులు చెబుతారు. ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి.
ఇక ఈరోజు అంటే మే 7న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర భారీగా పెరిగింది. ఆ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు(gold rate) పెరుగుదల నమోదు చేశాయి.. మరోవైపు వెండి ధరలు కూడా అంతర్జాతీయంగా కాస్త పెరిగాయి. దేశీయంగా ఆ ప్రభావం బాగానే కనిపించింది. వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు అంటే మంగళవారం (మే 7) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate) 200 రూపాయలు పెరిగి రూ.66,050ల వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 220 రూపాయలు పెరిగి రూ.72,050లుగా ఉంది.
Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate) పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 200 రూపాయలు పెరిగి రూ.66,200ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు పెరిగింది. దీంతో రూ.72,200లకు చేరుకుంది.
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. మొన్నటివరకూ బంగారం ధరల (Gold Rate) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య వెండి ధరలు కాస్త దిగివచ్చినట్టు కనిపించాయి. కానీ, ఈరోజు ఒక్కసారే కేజీకి వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.87,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 1000 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.84,000ల వద్ద నిలిచింది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల నమోదు అయింది. ఈరోజు ఉదయం 8గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,323.23డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కూడా పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 27.34డాలర్లకు చేరింది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.