Gold Rate Hike: కొద్దిరోజులుగా ఇంకా చెప్పాలంటే, గత నెల రోజులుగా బంగారం ధరలు పెద్దగా పెరగలేదు. కానీ, ఈనెల ప్రారంభం అయిన వెంటనే బంగారం ధరల్లో పెరుగుదల మొదలైంది. వరుసగా తగ్గడం లేదా స్థిరంగా ఉండడం అప్పుడప్పుడు కొద్దిగా పెరగడం తప్ప.. గత నెలలో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు రాలేదనే చెప్పాలి. అయితే, ఈ రెండురోజుల్లో బంగారం ధర భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. నిన్న 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 330 రూపాయలు పెరిగింది. ఈరోజు ఏకంగా 930 రూపాయల వరకూ పెరుగుదల నమోదు చేసింది. అంటే, రెండురోజుల్లోనే 1260 రూపాయలు ఎగసింది బంగారం ధర. బంగారం ధరల పరుగు ఇలా ఉంటె.. మరో వైపు వెండి కూడా అదే దారిలో పెరుగుదల కనబరుస్తోంది. రెండురోజుల్లో వెండి ధరలు వెయ్యిరూపాయల వరకూ పెరిగాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold Rate News) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే మార్చి 3న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Hike) బాగానే పెరిగింది. దీంతో ఆ ప్రభావం దేశీయంగానూ కనిపించింది. బంగారం ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. మరోవైపు నిన్న కాస్త పెరిగిన వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. ఈరోజు అంటే ఆదివారం (మార్చి 3) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate Hike) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) ధర 850 రూపాయలు పెరిగి రూ.58,750లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 930 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో రూ. 64,090ల వద్దకు ఎగసింది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Hike) భారీగా పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 10 గ్రాములకు 850 రూపాయలు పెరిగి రూ.58,900ల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పది గ్రాములకు 930 రూపాయలు పెరిగి రూ.64,240నమోదు అయింది.
Also Read : హమ్మయ్య అనుకునే ఛాన్స్ లేదు.. బంగారం ధర మళ్ళీ పెరిగింది..
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today)తో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. వరుసగా మూడో రోజూ వెండి ధరలు పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 800 రూపాయలు పెరిగి రూ.77,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 500 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 75,000ల వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Hike) 2092డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త తగ్గడంతో(Gold And Silver Price) ఔన్స్ 23.29 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.