Gold Rate Hike: బంగారం మోత ఆగడం లేదు. రోజు రోజుకూ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలు అని చెప్పుకోవడానికి కూడా ఎక్కడైనా ధర నిలబడితే కదా. రికార్డు స్థాయిని మించి ధరల పరుగులు కొనసాగుతున్నాయి. కొనాలనుకునేవారికి ఆమ్మో బంగారం అనిపించేలా పరిస్థితి ఉంది. అమెరికా ఫెడ్ రేట్లు తగ్గిస్తుంది అనే వార్తలు.. ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కంటిన్యూ అవుతుండడం, వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుండడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే మార్చి 8న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Hike) బాగానే పెరిగింది. ఈ అన్ని కారణాలతోనూ దేశీయంగానూ బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే శుక్రవారం (మార్చి8) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate Hike) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Hike) 400 రూపాయలు పెరిగింది. దీంతో రూ.60,100ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 430 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.65,560ల వద్దకు చేరుకుంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate Hike) పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) 400 రూపాయలు పెరిగింది. దీంతో రూ.60,250ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 430 రూపాయల పెరుగుదల నమోదు చేసి రూ.65,710లు గా నమోదు అయింది.
Also Read : తగ్గే ఛాన్స్ లేదంటున్న బంగారం.. ఆగని రికార్డు పరుగులు.. ఈరోజు ఎంతంటే..
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Hike)పెరుగుదల మధ్యలో వెండి కూడా పెరుగుతూ వస్తోంది. నిన్న ఒక్కరోజు కాస్త తగ్గినట్టు కనిపించినా.. మళ్ళీ ఈరోజు వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 500 రూపాయలు పెరిగి రూ.78,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి ధర 500 రూపాయలు పెరిగి రూ. 75,000ల వద్ద ఉంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. దీంతో ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Hike) 2152డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త పెరగడంతో(Gold And Silver Price) ఔన్స్ 24.45 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.