Gold Price Today: ఒక్కసారే భారీగా ఎగసిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. గత రెండు సెషన్ లోనూ బంగారం ధరలు పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా భారీగా పెరిగిన బంగారం ధరలు కంగారు పుట్టించాయి. అయితే, ఈరోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేకుండా ఉంది. బంగారం, వెండి ధరలు స్థిరంగా నిలిచాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold Price Today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు అంటే మార్చి 4న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price Today) బాగానే పెరిగింది. అయినప్పటికీ దేశీయంగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా నిలిచాయి. ఈరోజు అంటే సోమవారం (మార్చి 4) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate Hike) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు ఎటువంటి మార్పులు లేకుండా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) రూ.58,750ల వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా ఎటువంటి మార్పులు లేకుండా రూ. 64,090ల వద్దనిలిచింది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price Today) నిలకడగానే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) రూ.58,900ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా మార్పులు లేకుండా రూ.64,240నమోదు అయింది.
Also Read : హమ్మయ్య అనుకునే ఛాన్స్ లేదు.. బంగారం ధర మళ్ళీ పెరిగింది..
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Price Today)తో పాటు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి రూ.77,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి ధర రూ. 75,000ల వద్ద నిలకడగా ఉంది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate Hike) 2093డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త తగ్గడంతో(Gold And Silver Price) ఔన్స్ 23.14 డాలర్లుగా ఉంది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.