Gold Price Today: గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉందంటే.. 

ఈరోజు బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,550ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,600ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,000 వద్ద ఉంది.

Gold Price Today: గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉందంటే.. 
New Update

బంగారం ధరలు(Gold Price Today) దిగివస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న 330 రూపాయల వరకూ తగ్గిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. అంతకు ముందు రోజు కూడా బంగారం ధరలు మార్పులు లేకుండా ఉన్నాయి. తరువాత కాస్త తగ్గాయి. ఇప్పుడు అదే ధరల వద్ద కొనసాగుతోంది బంగారం. బంగారం ధరలు ఇటీవల కాలంలో రివ్వున ఎగసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా పెరగడమే తప్ప తగ్గుదల కనిపించని బంగారం ధరల్లో కాస్త నిలకడతనం వరసగా మూడోరోజూ కనిపించడం విశేషమనే చెప్పాలి. ఇది బంగారం ధరల తగ్గుదల మొదలవుతుంది అనేదానికి సూచనగా భావించవచ్చు.  పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో బంగారం ధరల్లో మార్పు రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.   బంగారం ధరల(Gold Price Today)పరిస్థితి ఇలా ఉంటే,  మరోవైపు వెండి ధరలు మాత్రం కేజీకి 500 రూపాయల మేర తగ్గడం గమనించదగ్గ విషయం. 

సాధారణంగా బంగారం ధరలు(Gold Price Today)  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ వస్తోంది. బంగారం ధరల(Gold Price Today)  తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి. 

ఇక ఈరోజు అంటే మే 1న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  భారీ తగ్గుదల  నమోదు చేసింది.   దీంతో దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపించింది.  బంగారం ధరలు(Gold Price Today) నిలకడగా నిలిచాయి.  మరోవైపు వెండి ధరలు అంతర్జాతీయంగా కాస్త తగ్గాయి.   దేశీయంగా కూడా ధరలు తగ్గాయి.  ఈరోజు అంటే బుధవారం (మే 1) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి.  దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate)  రూ.66,550ల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు దీంతో  రూ.72,600లుగా ఉంది. 

Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price Today) స్థిరంగా ఉన్నాయి.   ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.66,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.72,750ల వద్ద మార్పులు లేకుండా ఉంది. 

వెండి ధరలు ఇలా..

ఇక వెండి విషయానికి వస్తే.. మొన్నటివరకూ బంగారం ధరల (Gold Price Today) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే, రెండు రోజులు  స్థిరంగా నిలిచిన వెండి ధరలు ఈరోజు కేజీకి 500 రూపాయల మేర తగ్గాయి.  దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.87,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 500 రూపాయలు తగ్గి  రూ.83,500ల వద్దకు చేరింది. 

అంతర్జాతీయంగా..

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో భారీ తగ్గుదల నమోదు అయింది.  ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,287.26 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 26.41డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

#gold-rate-in-hyderabad #gold-rate
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe