Gold Price today: బంగారం అంటే మన దేశంలో విపరీతమైన క్రేజ్. అందుకు తగ్గట్టుగానే, బంగారం ధరలు ప్రతిరోజూ మారిపోతూ ఉంటాయి. బంగారం ధరల్లో మార్పులు అంతర్జాతీయ పరిస్థితులు.. స్థానిక డిమాండ్ ఆధారంగా ఉంటాయి. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు పరుగులు తీస్తూ వస్తున్నాయి. ఈరోజు ఒక్కసారిగా బంగారం అంతర్జాతీయంగా ఔన్సుకు 30 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో 2048 డాలర్ల పైగా ఔన్స్ బంగారం ధరలు ఉన్నాయి. అలాగే, వెండి కూడా ఎక్కువ ధరల వద్దే ఉంది. ఇది ఔన్సుకు 25.12 డాలర్ల వద్ద ఈరోజు ట్రేడ్ అవుతోంది.
ఇక దేశీయంగా చూస్తే బంగారం ధరలు(Gold Price today) ఆల్ టైమ్ హై కి చేరుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర రూ. 458 పెరిగి రూ. 61,895కి అమ్ముడవుతోంది. అంతకుముందు ఈ ఏడాది మే 4న బంగారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. అప్పుడు దాని ధర 10 గ్రాములు రూ.61,646గా ఉంది. స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకుల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల వచ్చే ఏడాదిలో బంగారం 10 గ్రాములకు రూ.67 వేలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు.. 2024లో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడుతుందనే భయం.. డాలర్ ఇండెక్స్‌లో బలహీనత.. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి బంగారం మద్దతు పొందుతుంది.
Aslo Read: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధర.. పసిడి ప్రియులకు ఊహించని షాక్..!!
మరోవైపు.. ఈరోజు వెండి కూడా దేశీయంగా పెరుగుదల కనబర్చి కిలో రూ.74,993కి చేరింది. అంతకుముందు రూ.73,046గా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు వెండి ధర రూ.4 వేలకు పైగా పెరిగింది.
ఇక హైదరాబాద్ లో ఈరోజు అంటే నవంబర్ 29 మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు(Gold Price today)ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,350లుగా ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.62,560లుగా ఉంది.
వెండి ధర విషయానికి వస్తే ఈరోజు కేజీ వెండి ధర రూ.81,500లుగా ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, వెండికి ఉన్న డిమాండ్ ఆధారంగా చూస్తే వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన ధరలు ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్న ధరలు. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అలాగే, అంతర్జాతీయంగా వచ్చే మార్పులు.. స్థానికంగా ఉండే డిమాండ్, టాక్స్ లు వంటివి కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల బంగారం కొనాలి అనుకున్నపుడు మార్కెట్ ధరలను ఒకసారి పరిశీలించడం అవసరం. అలాగే బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ చూసి కొనుగోలు చేయడం తప్పనిసరి.
Watch this interesting Video: