వరుసగా పెరుగుతూ.. రికార్డు స్థాయిలను కూడా దాటిపోయిన బంగారం ధరలు(Gold Price) కాస్త కిందకి దిగి వచ్చాయి. గత పది రోజుల్లో ఏకంగా నాలుగువేల రూపాయాలవరకు పెరిగిపోయి గోల్డ్ లవర్స్ ని కంగారు పెట్టిన బంగారం ధరలు ఎట్టకేలకు ఈరోజు కాస్త కిందికి దిగివచ్చాయి. బంగారం కొనాలనుకునే వారు ప్రతిరోజూ పెరుగుతున్న ధరలతో టెన్షన్ పడుతూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ధర కాస్త తగ్గడంతో బంగారం ధరలు ఇకపై ఇంకా తగ్గవచ్చేమో అనే ఆశతో ఉన్నారు. బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు ధరల తగ్గుదల(Gold Price) ఊరట కల్పించింది అని చెప్పవచ్చు. మరోవైపు నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కాస్త కిందికి దిగి వచ్చాయి. బంగారంతో పాటే వెండి ధరలు కూడా ఇటీవల కాలంలో పైపైకి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
సాధారణంగా బంగారం ధరలు(Gold Price) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే ఉంటోంది. అయితే, ఈరోజు మాత్రం బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడింది. బంగారం ధరల(Gold Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు బంగారం ధరల్లో మార్పులకు కారణంగా నిపుణులు చెబుతారు.
ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 14న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price drop) భారీ తగ్గుదల నమోదు చేసింది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా అంతర్జాతీయంగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో దేశీయంగా కూడా తగ్గాయి. ఈరోజు అంటే ఆదివారం (ఏప్రిల్ 14) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 700 రూపాయలు తగ్గి రూ.66,500ల వద్దకు దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 760 రూపాయలు తగ్గుదల నమోదు చేసి రూ.72,610ల వద్దకు చేరుకుంది.
ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) దిగివచ్చాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 700 రూపాయలు తగ్గి (Gold Rates drop) రూ.66,650ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా 760 రూపాయల తగ్గుదల నమోదు చేసి రూ.72,700ల వద్ద నిలిచింది.
Also Read : రాకెట్ కంటే వేగంగా దూసుకుపోతున్న బంగారం..75వేలకు చేరువలో
వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today) పెరుగుదల తో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న భారీగా పెరుగుదల చూపిన వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. కేజీకి 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది వెండి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.89,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 400 రూపాయల తగ్గుదలతో రూ.85,500ల వద్దకు దిగివచ్చింది.
అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు ఔన్స్ బంగారం 32 డాలర్ల వరకూ తగ్గింది. దీంతో 2344.53 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 27.94డాలర్లకు చేరింది.
గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.