Gold Price: ఎంతో కొంత పెరగడమే.. తగ్గనంటున్న బంగారం.. ఈరోజు ఎంతుందంటే.. 

బంగారం ఎక్కడా తగ్గడం లేదు. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,110ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.89,000 వద్ద ఉంది.

Gold Price: ఎంతో కొంత పెరగడమే.. తగ్గనంటున్న బంగారం.. ఈరోజు ఎంతుందంటే.. 
New Update

బంగారం ధరల పెరుగుదల ఆగే సూచనలు కనిపించడం లేదు. పెరగకుండా కాస్త నిలబడినా బావుండును అనే పరిస్థితికి పసిడి ప్రియులు వచ్చేసినా బంగారం మాత్రం ఏంతో కొంత పెరుగుతాను తప్ప తగ్గేది లేదు అంటూ పరుగులు తీస్తూనే ఉంది. బంగారం ధరలు  (Gold Price) ఎప్పుడు తగ్గుతాయి అని అందరూ చర్చించుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే, ధరలు తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు.  బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుదలలో పోటీ పడుతూనే వస్తున్నాయి. వరుసగా పెరుగుదల కనబరుస్తూ వస్తున్నాయి. ఎప్పుడైనా మధ్యలో కాస్త స్థిరంగా కనిపించినా.. మరుసటి రోజు భారీగా పెరిగి షాక్ ఇస్తున్నాయి. అయితే, నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు మాత్రం కాస్త నిదానించాయి. 

సాధారణంగా బంగారం ధరలు(Gold Price) ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే ఉంటోంది. ఈరోజు కూడా బంగారం ధరల పెరుగుదల ఆగలేదు. బంగారం ధరల(Gold Price) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో తగ్గుదల ఉండొచ్చనే సంకేతాలు, రాబోయే రెండు మూడు నెలల్లో కొన్ని దేశాల్లో సాధారణ ఎన్నికలు జరగబోతూ ఉండడం  బంగారం ధరల్లో పెరుగుదలకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు.   

ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 12న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Price Hike) భారీ పెరుగుదల నమోదు చేసింది.   దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా అంతర్జాతీయంగా పెరుగుదల నమోదు చేసినా.. దేశీయంగా మాత్రం కాస్త తగ్గాయి. ఈరోజు అంటే శుక్రవారం (ఏప్రిల్ 12) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు వరుసగా ఏడో రోజు  కూడా పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate Today) 100 రూపాయలు పెరిగి రూ.66,200ల వద్దఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 110 రూపాయలు పెరిగి రూ.72,220ల వద్దకు చేరుకుంది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..

అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) భగ్గుమన్నాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 100 రూపాయలు పెరిగి  (Gold Rates Hike) రూ.66,350ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరకూడా 110 రూపాయల పెరుగుదల నమోదు చేసి  రూ.72,370ల వద్ద నిలిచింది. 

Also Read : అదే తీరు..అదే జోరు..ఆగని బంగారం పరుగు.. ఈరోజు ఎంతంటే..  

వెండి ధరలు ఇలా..

ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rate Today) పెరుగుదల తో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, నిన్న భారీగా పెరుగుదల చూపిన వెండి ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. కేజీకి 600 రూపాయల తగ్గుదల నమోదు చేసింది వెండి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.88,400ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 600 రూపాయల తగ్గుదలతో రూ.84,900ల వద్దకు ఎగసింది. 

అంతర్జాతీయంగా..

మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం 57 డాలర్ల వరకూ పెరిగింది. దీంతో  2392.59  డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప పెరుగుదలతో(Gold And Silver Price) ఔన్స్ 28.80డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

#gold-rate-in-hyderabad #gold-rate
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe