Gold Rates Today: గుడ్ న్యూస్ బంగారం ధర మళ్లీ తగ్గింది! ఎంతంటే..

బంగారం కొనాలని అనుకునే వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి. మార్కెట్ ప్రారంభానికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,700, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 72,770 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 91,000 గా ఉంది. 

Gold Rate Today: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 
New Update

Gold Rate Today : బంగారం ధరలు మరింత దిగొచ్చాయి. అంతకు ముందు వరుసగా రెందు రోజులపాటు తగ్గుదల కనపరిచిన బంగారం.. నిన్న స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈరోజు మళ్ళీ బంగారం ధర తగ్గింది. అలాగే  వెండి విషయానికి వస్తే రెండురోజుల తగ్గుదలకు బ్రేక్ వేస్తూ నిన్న స్థిరంగా ఉన్న వెండి భారీగా తగ్గుదల నమోదు చేసింది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 3న బంగారం ధరలు మరింత తగ్గి బంగారం కొనాలని అనుకునేవారికి ఊరట కలిగించాయని చెప్పవచ్చు.  ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కొద్దిపాటి తగ్గుదలతో ట్రేడ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) స్థిరంగా లేదా కాస్త తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold and Silver Price : తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 250 రూపాయలు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 270 రూపాయలు దిగి వచ్చింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోనూ ఈరోజు బంగారం ధరలు ఇదే ధోరణిలో ఉన్నాయి. అక్కడా  22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 270 రూపాయలు తగ్గింది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. 

 ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి 

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,700

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,770

ఇక విజయవాడ ,  విశాఖపట్నం , తిరుపతి లలోనూ బంగారం ధరలు తగ్గుదల  కనబరిచాయి. ఆ ప్రాంతాల్లో ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం ధరలు ఇలా ఉన్నాయి .  

22 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 66,700

24 క్యారెట్లు 10 గ్రాములకు ₹ 72,770

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగొచ్చాయి.  ఈరోజు తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ₹ 66,850

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 72,920

Gold Rate Today: బంగారం ధరలు తగ్గుదల కనబరచగా. .  మరోవైపు వెండి ధరలు కేజీకి 1000 రూపాయలు తగ్గాయి. హైదరాబాద్ లోనూ ,  ఢిల్లీలోనూ కూడా వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. 

హైదరాబాద్ లో వెండి ధర కేజీకి.. ₹ 91,000 గానూ ,  ఢిల్లీలో వెండి ధర కేజీకి ₹ 86,000 గానూ ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నాయి .  

ఇక అంతర్జాతీయంగా బంగారం ధరల్లో  తగ్గుదల కనిపిస్తోంది.   ఈరోజు అంటే సెప్టెంబర్ 3 ఉదయం 6 గంటల సమయానికి అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సు 2,407 డాలర్ల వద్ద ఉన్నాయి.  అలాగే వెండి ధరలు బాగా తగ్గి కేజీకి 917 డాలర్లకు దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి.

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe