Gold Loan Tips : గోల్డ్ లోన్స్ మోసాలు.. లోన్ తీసుకునేముందు వీటిని చెక్ చేసుకోండి!

గోల్డ్ లోన్స్ విషయంలో చాలా కంపెనీలు అవకతవకలకు పాల్పడుతున్నాయి. వీటిలో ముఖ్యమైనది గోల్డ్ వాల్యూ తక్కువగా నిర్ణయించడం. ఎప్పుడైనా అవసరం కోసం గోల్డ్ లోన్ తీసుకోవాలంటే, కొన్ని అంశాలను పరిశీలించాలి. లోన్ తీసుకునేముందు చెక్ చేయాల్సిన అంశాలలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

New Update
Gold Price Policy: ఇప్పుడు దేశం మొత్తం బంగారానికి ఒకే ధర, 'వన్ నేషన్, వన్ రేట్' విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది!

Gold Loan Tips : ఇటీవల ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌(IIFL Finance) పై ఆర్‌బీఐ(RBI) కొరడా ఝుళిపించింది. కంపెనీకి చెందిన 67 శాతం గోల్డ్ లోన్ ఖాతాల్లో గోల్డ్ లోన్ టు వాల్యూ రేషియో అంటే ఎల్‌టీవీలో వ్యత్యాసం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అప్పు ఇస్తూనే బంగారం ధర(Gold Loan Tips) నిర్ణయించడంలో కంపెనీ నిర్వాహకులు ఓ ఆట ఆడారు. ఇది బయటపడిన తరువాత, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్స్ ఇవ్వకుండా RBI నిషేధించింది.

నిజానికి, గోల్డ్ లోన్(Gold Loan Tips) తీసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. అనేక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటే NBFCలు ఇంటింటికీ బంగారు రుణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. గోల్డ్ లోన్‌కు ఎడ్యుకేషన్ లోన్స్ లేదా పర్సనల్ లోన్స్ లోలా ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. కొన్ని గంటల్లో లోన్ లభిస్తుంది. అందువల్ల గోల్డ్ లోన్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో గోల్డ్ లోన్ వ్యవస్థీకృత మార్కెట్ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో బ్యాంకుల వాటా 80 శాతం కాగా, మిగిలినది ఎన్‌బీఎఫ్‌సీలది. అటువంటి పరిస్థితిలో, మీరు గోల్డ్ లోన్ (Gold Loan Tips) తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, కొన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అవేమిటో చూద్దాం. 

బంగారం ధరపై ఎంత లోన్ తీసుకోవచ్చు?
మీరు ఏదైనా బ్యాంక్ లేదా NBFC నుండి గోల్డ్ లోన్(Gold Loan Tips) తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, వారు చేసే మొదటి పని మీ బంగారం ధరను నిర్ణయించడం. RBI నిబంధనల ప్రకారం, బ్యాంకులు, NBFCలు బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలవు. ఆర్‌బీఐ తాజా రిపోర్ట్ లో, లోన్ ఇచ్చే సమయంలో బంగారం ధరను తక్కువగా అంచనా వేస్తున్నారని, తద్వారా వినియోగదారుడు లోన్ తిరిగి చెల్లించలేకపోతే, ఆ బంగారాన్ని వేలం వేయడం ద్వారా లాభం పొందవచ్చని చూస్తున్నట్లు తెలుస్తోంది.  కాబట్టి, గోల్డ్ లోన్ తీసుకునే ముందు, మీ బంగారం విలువను వేరే కంపెనీ ద్వారా కూడా అంచనా వేయండి. ఇప్పుడు తనిష్క్ - కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి అనేక సంస్థలు బంగారంపై ఉచిత మదింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. రశీదు కూడా ఇస్తున్నారు. ఇలా రసీదు తీసుకోవడం ద్వారా లోన్(Gold Loan Tips) తీసుకునేటప్పుడు దానిని చూపించి ఎక్కువ మొత్తం లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. 

Also Read : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. బంగారం పరుగులకు బ్రేక్.. కాస్త తగ్గిన వెండి!

కంపెనీ మోసానికి పాల్పడవచ్చు..
ఏదైనా ఫైనాన్స్ కంపెనీ మీ బంగారాన్ని తక్కువగా అంచనా వేస్తున్నట్లయితే అప్రమత్తంగా ఉండండి. ఆ కంపెనీ పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయని స్పష్టంగా అర్థం చేసుకోండి. మీరు ఆ కంపెనీ నుంచి లోన్(Gold Loan Tips) తీసుకుంటే, అది మిమ్మల్ని వడ్డీ- పెనాల్టీ పరంగా మోసం చేయవచ్చు.

సెసింగ్ ఫీజులో భారీ వ్యత్యాసం..
బ్యాంకులు - ఎన్‌బిఎఫ్‌సిల బంగారు రుణాల వడ్డీ రేట్లు,  ప్రాసెసింగ్ ఫీజులలో భారీ వ్యత్యాసం ఉంది. సాధారణంగా, ప్రభుత్వ బ్యాంకులు 8.65 నుండి 11 శాతం వరకు రేట్లలో గోల్డ్ లోన్స్ అందిస్తాయి.  అయితే యాక్సిస్,హెచ్‌డిఎఫ్‌సి వంటి ప్రైవేట్ బ్యాంకులు వార్షికంగా 17 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. NBFCల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రేట్లు 36 శాతం వరకు ఉంటాయి.  అదేవిధంగా, ప్రాసెసింగ్ ఫీజులో కూడా భారీ వ్యత్యాసం ఉంది.

SBI, కెనరా బ్యాంక్ లోన్ మొత్తంపై 0.5% లేదా గరిష్టంగా రూ. 5000 ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేస్తున్నాయి. NBFCలు లోన్(Gold Loan Tips) మొత్తంలో 1% కంటే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొద్దిగా హోంవర్క్ చేయడం ద్వారా, మీరు ప్రతి సంవత్సరం వడ్డీలో మంచి మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

గోల్డ్ లోన్ ఎంతకాలం ఉంటుంది?
సాధారణంగా గోల్డ్ లోన్(Gold Loan Tips) టైం పిరియడ్ గరిష్టంగా మూడేళ్లు ఉంటుంది. ఈ లోన్  తిరిగి చెల్లించడానికి వివిధరకాల అవకాశాలు  అందుబాటులో ఉన్నాయి. మొదటి ఎంపికలో, మీరు ప్రతి నెలా వడ్డీని చెల్లిస్తారు.  చివరికి మీరు అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. రెండవ ఎంపికలో, మీరు ప్రతి నెలా చెల్లించే వడ్డీ, అసలు మొత్తాన్ని జోడించడం ద్వారా EMI రూపంలో చెల్లించే వీలుంటుంది. కొన్ని గోల్డ్ లోన్లలో బుల్లెట్ చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉంది. ఉదాహరణకు, మీరు లక్ష రూపాయల లోన్  తీసుకున్నారు. ఈ లోన్ పై  ఏడాదిలో రూ.10 వేల వడ్డీ అయింది. ఏడాది పూర్తయిన తర్వాత, ఒకే మొత్తంలో రూ. 1.10 లక్షలు చెల్లించి మీ బంగారాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏ విధాన్నైనా ఎంచుకోవచ్చు.

నిపుణులు ఏమంటున్నారు?
బంగారం ధర కంటే గోల్డ్ లోన్ (Gold Loan Tips) మొత్తం ఎప్పుడూ తక్కువగానే ఉంటుందాని నిపుణులు చెబుతున్నారు. ఫైనాన్స్ కంపెనీ బంగారం వాల్యుయేషన్‌ను తగ్గిస్తే, మీకు తక్కువ రుణం లభిస్తుంది. ఏదైనా ఇబ్బందుల వాళ్ళ మీరు ఈ లోన్ తిరిగి చెల్లించలేకపోతే, మీ బంగారం వేలం వేస్తారు. దీని వల్ల మీరు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. కాబట్టి, గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు, బంగారం వాల్యుయేషన్, వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు గురించి మీ హోమ్‌వర్క్ పూర్తిగా చేయండి.

ఇది లాభదాయకమైన వ్యాపారం కాబట్టి, మార్కెట్లో గోల్డ్ లోన్(Gold Loan Tips) ప్రొవైడర్లు అధికంగా ఉన్నారు. కానీ మీరు ఆర్‌బిఐ నియంత్రిత బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి మాత్రమే గోల్డ్ లోన్ తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మీ తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా లోన్ మొత్తాన్ని ఎంచుకోవాలని వారు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు