Gold Loan Rules: ఇకపై పూర్వీకులు తాకట్టు పెట్టిన నగలు విడిపించుకోవడం ఈజీ!

బంగారం తనఖా పెట్టి పూర్వీకులు తీసుకున్న లోన్ తీర్చి.. ఆభరణాలు రీడీమ్ చేసుకోవడం ఇకపై ఈజీగా మారుతుంది. ఈ మేరకు బ్యాంకులు కొత్త రూల్ తీసుకురాబోతున్నాయి. ఇంతవరకూ అలాంటి నగలను తిరిగి తీసుకోవడం వారసులకు కష్టతరంగా ఉండేది. 

New Update
Gold Rates : బంగారం ప్రియులకు తీపి కబురు..తగ్గిన పసిడి, వెండి ధరలు

Gold Loan Rules: బ్యాంకులో తనఖా పెట్టిన పూర్వీకుల బంగారు ఆభరణాలను రీడీమ్ చేసుకోవడం ఇప్పుడు సులభతరం అవుతుంది. ఆంగ్ల వార్తాపత్రిక ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, బ్యాంకులు అటువంటి నియమాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాయి. దీని ప్రకారం నగలను తనఖా పెట్టి రుణం తీసుకునే వ్యక్తి మరణిస్తే, అతని వారసులు సులభంగా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు అలాగే, తనఖా పెట్టిన నగలను విడిపించుకోవచ్చు. 

ప్రస్తుత వ్యవస్థలో కూడా, వారసుడు తనఖా పెట్టిన ఆభరణాలను విడుదల చేయవచ్చు.  కానీ దాని కోసం అతను సుదీర్ఘ న్యాయ ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా అంత సులభతరం కాదు.  అనేక సవాళ్లతో ఉంటుంది. దీంతో వారసుడు ఆభరణాలను తీసుకోవడానికి నిరాకరించడం అలాగే అటువంటి పరిస్థితిలో బ్యాంకు నగలను వేలం వేయవలసి రావడం కూడా చాలా సార్లు జరుగుతుంది. కొత్త విధానంలో, రుణం ఇచ్చే సమయంలో రుణం తీసుకునే వ్యక్తి లోన్ క్లియర్(Gold Loan Rules) చేయడం ద్వారా ఆభరణాలను ఎవరు రిడీమ్ చేసుకోవచ్చు అని అడుగుతారు. ఇది దాదాపుగా బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేసినపుడు నామినీని అడిగిన విధంగానే ఉంటుంది. అంటే ఎవరు తమ తదనంతరం లోన్ తీర్చి నగలను వాపసు తీసుకోవచ్చు అనే విషయాన్ని లోన్ తీసుకున్నవారు ముందే చెప్పడం జరుగుతుంది. దీనితో వారు తనఖా పెట్టిన ఆభరణాలను వారసులు విడిపించుకోవడం సులభం అవుతుంది.

Also Read:ఈ 555 రూల్ పాటిస్తే.. రిటైర్మెంట్ లైఫ్ కోట్లతో ఎంజాయ్ చేయొచ్చు! 

నివేదిక ప్రకారం, కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఆ విధానంలో బంగారు రుణాలు ఇవ్వడం ప్రారంభించాయి, అయితే ఈ వ్యవస్థకు సంబంధించి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ లేకపోవడం వల్ల, ఇది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో అమలు కావడం లేదు. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో నేతృత్వంలోని కమిటీ గత ఏడాది బంగారంపై రుణం(Gold Loan Rules) తీసుకునే వ్యక్తి మరణిస్తే, అతని చట్టబద్ధమైన వారసుడిని సంప్రదించి బ్యాంకులో లోన్ తీర్చి ఆభరణాలు వెనక్కి తీసుకోవాలని కోరాలని సూచించింది.

దేశంలో బంగారు ఆభరణాలపై రుణాలు ఇచ్చే వ్యాపారం వేగంగా పెరుగుతోంది.  ఈ కారణంగా అటువంటి వ్యవస్థ అవసరం ఏర్పడింది. గత ఏడాది కాలంలో దేశంలో బంగారు ఆభరణాల రుణాల వ్యాపారం 17 శాతానికి పైగా పెరిగి నగలపై బకాయి ఉన్న రుణం రూ.1.02 లక్షల కోట్లకు చేరుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు