అరుదైన బంగారు బల్లి ప్రత్యక్షం... వైరల్ అవుతున్న ఫోటోలు......

New Update

సాధారణంగా మనకు నిత్యం ఎక్కువగా కనిపించే బల్లి నలుపు రంగును కలిగి ఉంటుంది. ఇక్కడ మాత్రం బంగారు పూతను కలిగిన బల్లి ఉందండి.. అంతరించిపోతున్న జీవ జాతుల్లో అరుదైన జాతికి చెందిన జాతి బంగారు బల్లి. అక్కడక్కడ కనిపించే బంగారు బల్లి చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బల్లి వార్తల్లోకి నిలిచి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

gold-lizards-identified-in-polavaram-forest

ఇలాంటి బల్లులు బంగారు వర్ణాన్ని పోలిన ముదురు పసుపు రంగులో ఉంటాయి. 15 సెంటీమీటర్ల నుంచి 18 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. సూర్యరశ్మి సోకని, చల్లని ప్రదేశాల్లో ఇవి నివసిస్తూ ఉంటాయి. రాత్రి పూట మాత్రమే ఇవి అడవుల్లో సంచరిస్తాయి. రాతి గుహలు, గుహల సందుల మధ్య ఉండే తేమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలో ఉన్న గుహల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఈ బల్లులు ఒకే సారి 40 నుంచి 150 వరకు గుడ్లను పెడతాయి. అయితే గుడ్లను పాములు, ఇతర క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాబితాలో చేరాయని అధికారులు తెలుపుతున్నారు.

తిరుమల ఆలయానికి 3 కి.మీ దూరంలోని చక్రతీర్థంలో ఈ బంగారు బల్లులు ఎక్కు వగా కనిపిస్తున్నాయని చెబుతారు. బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో కనిపిస్తుందనే చర్చ ఉంది. బంగారు వర్ణంతో కనిపించే ఈ బల్లులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కాలొడాక్టి లోడన్‌ ఇల్లింగ్‌ గోర్థోరన్‌ జాతికి చెందిన బంగారు బల్లి ఓసారి... శ్రీలంకలో కనిపించింది. ఈ రెండు జాతులు ప్రపంచంలో మరెక్కడా ఉండవని అంటుంటారు. బంగారు బల్లి శాస్త్రీయనామం కాలొడాక్టి లోడస్‌ అరీస్‌. ఎక్కువగా రాత్రిళ్లలో సంచరించే నిశాచర జీవి ఇది.. అయితే.. బంగారు వర్ణాన్ని పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో ఉంటుంది. బంగారు బల్లుల్లోనూ రెండు జాతులుగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవి సాధారణ బల్లుల కంటే పెద్దగా అరుస్తూ వింత శబ్దం చేస్తాయని చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు